ఆ హీరోయిన్ స్నానం చేస్తుంటే చూడాలి : హీరో

Wed 15th May 2019 07:04 PM
shahid kapoor,speech,kabir singh,promotion  ఆ హీరోయిన్ స్నానం చేస్తుంటే చూడాలి : హీరో
Shahid Kapoor Gives Shock to Journalist with his Answer ఆ హీరోయిన్ స్నానం చేస్తుంటే చూడాలి : హీరో
Sponsored links

ప్రతి మనిషికి ఓ ఇష్టమైన వ్యక్తి ఉంటారు. దీనికి సినీ సెలబ్రిటీలు ఏమీ అతీతం కాదు. ఉదాహరణకు శ్రీదేవి అంటే రాంగోపాల్‌వర్మకి ఎంత పిచ్చో అందరికీ తెలిసిందే. ఇదే కోవలోకి వచ్చే హీరో ‘కబీర్‌సింగ్‌’.. అదేనండీ.. తెలుగు ‘అర్జున్‌రెడ్డి’కి బాలీవుడ్‌ రీమేక్‌గా రూపొందుతున్న ‘కబీర్‌సింగ్‌’ హీరో షాహిద్‌ కపూర్‌. కాగా ఈ మూవీ జూన్‌ 21న విడుదల కానుంది. ‘ఉడ్తాపంజాబ్‌’లో కూడా డ్రగ్‌ ఎడిక్ట్‌గా అద్భుతంగా నటించిన షాహిద్‌కపూర్‌ ప్రస్తుతం డ్రగ్స్‌కి బానిస అయిన మెడికోగా నటిస్తున్నాడు. ఈ చిత్రం షూటింగ్‌ పూర్తి అయింది. 

తాజాగా ట్రైలర్‌ కూడా విడుదల కావడంతో యూనిట్‌ ప్రమోషన్ల వేగాన్ని పెంచింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మీడియా ప్రతినిధి ఒకరు మీకు ‘మిస్టర్‌ ఇండియా’లాగా మాయమయ్యే శక్తి వస్తే ఏం చేస్తారు? అని ప్రశ్నించాడు. దానికి షాహిద్‌కపూర్‌ చెప్పిన సమాధానం షాకింగ్‌గానే కాదు.. తమాషాగా కూడా ఉంది. ఆయన మాట్లాడుతూ, నాకు మాయం అయ్యే శక్తి వస్తే చిన్నచిన్న పనులు ఎందుకు చేస్తాను? పెద్దపెద్ద పనులే చేస్తాను. ఆ ఛాన్స్‌ వస్తే తప్పకుండా స్కార్లెట్‌ జాన్సన్‌ స్నానం చేస్తుండగా చూడాలని కోరుకుంటాను అంటూ ఇచ్చిన సమాధానం షాహిద్‌ కపూర్‌కి స్కార్లెట్‌ జాన్సన్‌ అంటే ఎంత పిచ్చో అర్ధమవుతోంది. 

ఆయన ఇంకా మాట్లాడుతూ, ఆమె వివాహం నా వల్ల ఆగిపోయిందనే ప్రచారం జరిగితే ఎంతో ఆనందిస్తాను. ఎందుకంటే ఆమంటే నాకు అంత ఇష్టం. అయినా స్కార్లెట్‌ జాన్సన్‌ అంటే ఇష్టపడని వారు ఎవరుంటారు? చెప్పండి.. అంటూ తన మనసులోని కోరికను వెలిబుచ్చాడు. గతంలో కూడా షాహిద్‌ ఆమంటే ఎంత ఇష్టమో పలు మార్లు, పలు ఇంటర్వ్యూలలో కూడా తెలిపాడు. మొత్తానికి షాహిద్‌కపూర్‌ కూడా వర్మలానే ఓ హీరోయిన్‌ పిచ్చోడు అని అర్ధమవుతోంది. 

Sponsored links

Shahid Kapoor Gives Shock to Journalist with his Answer:

Shahid Kapoor Speech at Kabir Singh Promotion

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019