ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Venkatesh and Varun Tej Voices for Aladdin

‘అల్లాదిన్’కు మనోళ్ల వాయిస్.. అంతేగా..!!

టాలీవుడ్ సీనియర్ హీరో వెంకటేష్, యంగ్ హీరో వరుణ్ తేజ్ ఇటీవలే బ్లాక్ బస్టర్ మూవీ ఎఫ్ 2 కోసం కలిసి పని చేశారు. వీరిద్దరు మరోసారి ఓ సినిమాకి కలిసి వర్క్ చేయనున్నారు.  అయితే ఈ సినిమాలో వీరు కలిసి నటించట్లేదు. ఒకప్పుడు చిన్నపిల్లలను ఆకట్టుకున్న ‘అల్లాదిన్’ సినిమాను ఇప్పుడు అమెరికాకు చెందిన ఫాంటసీ అడ్వెంచర్ ఫిల్మ్ ‘అల్లాదిన్’ టైటిల్‌తో తెరకెక్కిస్తోంది. ఈ  సినిమాను తెలుగులో కూడా గ్రాండ్ గా రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు.  

ఈ సినిమాలో జీని (దెయ్యం) పాత్రకు వెంకటేష్ గొంతు అరువివ్వడం విశేషం. అలాగే అల్లాదిన్ పాత్రకు వరుణ్ తేజ్ డబ్బింగ్ చెప్పారు. ఇటీవలే దీనికి సంబంధించిన తెలుగు టీజర్‌ను రిలీజ్ చేసారు. ఈ సినిమాలో జీనీగా హాలీవుడ్ నటుడు విల్ స్మిత్ నటించాడు. ఇక అల్లాదిన్‌గా మేనా మసూద్ యాక్ట్ చేసాడు. మొత్తంగా వెంకటేష్, వరుణ్ తేజ్ గొంతులతో ‘అల్లాదిన్’ తెలుగు డబ్బింగ్ వెర్షన్‌కు మంచి క్రేజ్ వచ్చే అవకాశాలు వున్నాయి. ఈ సినిమా మే 24న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది.

Click Here For Trailer

Venkatesh & Varun Tej Rocking Combo Again

Venkatesh and Varun Tej Voices for Aladdin
venkatesh
varun tej
aladdin
trailer
voiceover