ఈ మన్మథుడికి హీరోయిన్లు ఎంతమంది?

Sun 03rd Mar 2019 05:17 PM
anushka,samantha,nagarjuna,manmadhudu 2 movie  ఈ మన్మథుడికి హీరోయిన్లు ఎంతమంది?
Manmadhudu 2 Movie latest Update ఈ మన్మథుడికి హీరోయిన్లు ఎంతమంది?
Sponsored links

టాలీవుడ్‌లో ఎవర్‌గ్రీన్‌ లవర్‌బోయ్‌, మన్మథుడు, గ్రీకువీరుడు.. ఇలా పలు బిరుదులు కింగ్‌ నాగార్జునకి ఖచ్చితంగా సరిపోతాయి. ఆయన మాస్‌ చిత్రాలలో నటించినా కూడా ఆయనకున్న డ్రీమ్‌ బోయ్‌, మన్మథుడు ఇమేజ్‌ మాత్రం ఎవ్వరూ కదలించలేకపోయారు. ఆ తర్వాత ఏదో మహేష్‌బాబు, ప్రభాస్‌లు మాత్రమే దానికి చేరువలోకి వచ్చారు. ఇక నాగార్జున కెరీర్‌లో అతి పెద్ద క్లాసిక్‌గా నిలిచి పోయిన చిత్రం ‘మన్మథుడు’. కథ, మాటలు త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌, సంగీతం దేవిశ్రీప్రసాద్‌, విజయభాస్కర్‌ దర్శకత్వంలో వచ్చిన ఇందులో బ్రహ్మానందం, సునీల్‌లు కూడా కీలక పాత్రను పోషించారు. సోనాలిబింద్రే, అన్షులు హీరోయిన్స్‌గా యాక్ట్‌ చేసిన ఈ చిత్రం రివార్డులనే కాదు.. అవార్డులను కూడా కొల్లగొట్టింది. ఇప్పుడు ఈ చిత్రానికి సీక్వెల్‌ని నాగార్జున చేస్తున్నాడు. నటుడు కం డైరెక్టర్‌, కేవలం దర్శకునిగా ఒకే ఒక చిత్రం అనుభవం ఉన్న రాహుల్‌ రవీంద్రన్‌ దర్శకుడు. 

ఇక ఇందులో నాగార్జునకి భార్యగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ కాస్త వయసు ఎక్కువగా ఉండే గృహిణి పాత్రలో నటిస్తోందని తెలుస్తోంది. మరోవైపు ‘మన్మథుడు 2’లో స్వీటీ అనుష్కతో పాటు అక్కినేని కోడలు సమంత కూడా కీలక పాత్రను చేస్తోందిట. గతంలో నాగార్జునతో ఆమె ‘మనం, రాజు గారి గది 2’ చిత్రాలలో నటించింది. కానీ అవి నాగార్జునకు జోడీ పాత్రలు కావు. మామ, కోడళ్ల పాత్రలు విడివిడిగా ఉంటాయి. ఆ లెక్కన ‘మన్మథుడు 2’లో కూడా సమంత హీరోయిన్‌ పాత్రని కాకుండా నాగ్‌కి జోడీ కానటువంటి ఓ కీలకపాత్రను పోషిస్తున్నట్లు సమాచారం. 

ఇక పాయల్‌ రాజ్‌పుత్‌ని తీసుకున్నారని అంటున్నారు. కానీ ఆ ఆఫర్‌ తనకి ఇంకా రాలేదని పాయల్‌ స్పష్టం చేసింది. మరోవైపు ‘మన్మథుడు 2’లో నాగార్జున శ్రీమతి అమల అక్కినేని కూడా ఓ పాత్రను చేయనుందని అంటున్నారు. మరి అమల పాత్రకు బదులుగా సమంతని తీసుకున్నారా? లేక ఇందులో అక్కినేని ఫ్యామిలీ ఇద్దరు కోడళ్లు అయిన అమల, సమంత ఇద్దరు నటిస్తారా? అనేది తేలాల్సివుంది. మొత్తానికి ‘మన్మథుడు 2’కి రతీదేవిలు ఎంతమందో వేచిచూడాల్సివుంది...!

Sponsored links

Manmadhudu 2 Movie latest Update:

Anushka and Samantha in Manmadhudu 2 Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019