RRR : బాలీవుడ్ స్టారేనా విలన్!

Mon 11th Feb 2019 08:23 PM
akshay kumar,replace,ajay devagan,rrr movie,villain,bollywood  RRR  : బాలీవుడ్ స్టారేనా విలన్!
Bollywood Star Villain in RRR RRR : బాలీవుడ్ స్టారేనా విలన్!
Sponsored links

టాలీవుడ్ లో మోస్ట్ క్రేజియస్ట్ ప్రాజెక్ట్ గా తెరకెక్కుతున్న భారీ చిత్రం RRR . రామ్ చరణ్ - ఎన్టీఆర్ లతో తీస్తున్న ఈసినిమాలో ఇంతవరకు విలన్ ఎవరు అనేది మాత్రం ఎక్కడ బయటికి రాలేదు. అందుకోసం రాజమౌళి పలువురు విలన్ల పేర్లను పరిశీలించారట. అందులో మొదటగా బాలీవుడ్ యాక్షన్ హీరో అజయ్ దేవగన్ ఓ ఆప్షన్ అని తెలుస్తోంది.

రాజమౌళి తీసిన ఈగ సినిమా హిందీ వెర్షన్ కి దేవగన్ - కాజోల్ డబ్బింగ్ చెప్పారు. సో ఆ చొరవతోనే అజయ్ దేవగన్ ని రాజమౌళి సంప్రదించారట. మరి ఏమైందో ఏంటో తెలియదు కానీ ఈ ప్రాజెక్ట్ చేయడానికి దేవగన్ నో చెప్పాడట. కారణాలు ఏంటో తెలియదు కానీ దేవగన్ ప్రస్తుతం ఎక్కువ లావుగా ఉండడమే అందుకు కారణం అంటున్నారు. దేవగన్ అలా నో చెప్పాడో లేడో వెంటనే అక్షయ్ లైన్ లోకి వచ్చేశాడు.

రాజమౌళి వెళ్లి అక్షయ్ ని సంప్రదించగా వెంటనే ఓకే చెప్పేశాడట. ఒకవేళ అక్షయ్ కుమార్ ఓకే చేస్తే రెండో అతిపెద్ద సౌత్ సినిమా అవుతుంది. ఇక అజయ్ దేవగన్ ఇదివరకూ ‘భారతీయుడు 2’ ఆఫర్ ని కాదనుకున్నారు. ఇప్పుడు RRR. దాదాపు 300కోట్ల బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమాపై ఇప్పటినుండే అంచనాలు పెరిగాయి. హీరోయిన్స్ ని ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది.

Sponsored links

Bollywood Star Villain in RRR:

Akshay Kumar Replaced Ajay Devagan

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019