స్పెష‌ల్‌ ట్రీట్ రెడీ చేస్తున్న మ‌హేష్‌!

mahesh babu special treat to fansmahesh babu special treat to fans

త‌మ అభిమాన హీరో నుంచి ఏదైనా సంథింగ్ స్పెష‌ల్ రాబోతోందంటే ఫ్యాన్స్ చేసే హంగామానే వేరు. అలాంటి హంగామా ప్రిన్స్ మ‌హేష్ అభిమానులు చేయ‌డానికి  రెడీ అవుతున్నారు. మ‌హేష్‌బాబు న‌టిస్తున్న తాజా చిత్రం `మ‌హ‌ర్షి`. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో ముగ్గురు నిర్మాత‌లు అశ్వ‌నీద‌త్‌, దిల్ రాజు, పీవీపీ ప్ర‌సాద్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. మ‌హేష్ స్నేహితుడి అల్ల‌రి న‌రేష్ న‌టిస్తున్న ఈ సినిమా షూటింగ్ చివ‌రి షెడ్యూల్ ప్ర‌స్తుతం పొల్లాచ్చీలో జ‌రుగుతోంది. ఇక్క‌డే న‌రేష్‌కు సంబంధించిన కీల‌క స‌న్నివేశాల‌ని చిత్రీక‌రిస్తున్నారు. 

`శ్రీ‌మంతుడు` చిత్ర క‌థ‌ను పోలి వున్నా క‌థ‌నం కొత్త‌గా వుంటుంద‌ని తెలుస్తోంది. మహేష్ మేకోవ‌ర్‌, క్యారెక్ట‌ర్ డిజైన్ చేసిన తీరు కొత్త‌గా వుండ‌టంతో ఈ సినిమాపై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి. ఆ అంచ‌నాల‌కు ఏ మాత్రం త‌గ్గ‌ని స్థాయిలో సినిమా వుంటుంద‌ని చిత్ర బృందం హామీ ఇస్తోంది. మ‌హేష్ పుట్టిన రోజున ఈ చిత్ర ఫ‌స్ట్‌లుక్‌ని, ఆ త‌రువాత చిన్న పాటి మోష‌న్‌ టీజ‌ర్‌ని వ‌దిలిన చిత్ర బృందం మ‌హేష్ ఫ్యాన్స్ కోసం స్ప‌ష‌ల్ ట్రీట్‌ని సిద్ధం చేస్తున్న‌ట్లు తెలిసింది. గ‌త చిత్రాల‌కు మించి మ‌హేష్‌ని స్టైలిష్‌గా ప్ర‌జెంట్ చేస్తున్న వంశీ పైడిప‌ల్లి ఈ సారి పూరిస్థాయి టీజ‌ర్‌ని వ‌ద‌ల‌బోతున్నాడ‌ట‌.

మ‌హాశివ‌రాత్రి ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకుని మార్చి 4న ఈ చిత్ర టీజ‌ర్ఉ విడుద‌ల చేయ‌డం కోసం చిత్ర బృందం అప్పుడే క‌స‌ర‌త్తులు మొద‌లుపెట్టిన‌ట్టు తెలిసింది. సినిమాను ఏప్రిల్ నుంచి జూన్‌కు వాయిదా వేసిన చిత్ర వ‌ర్గాలు మ‌హేష్ ఫ్యాన్స్‌ని కూల్ చేయ‌డం కోసం టీజ‌ర్ రూపంలో స్పెష‌ల్ ట్రీట్‌ని ప్లాన్ చేశార‌ని వినిపిస్తోంది. దీని వ‌ల్ల ఈ సినిమా ఆల‌స్యంపై నిరాశ‌లో వున్న అభిమానుల‌ను కూల్ చేసిన‌ట్ల‌వుతుంద‌ని చిత్ర బృందం భావిస్తోంద‌ట‌. టీజ‌ర్ చూసి మ‌హేష్ ఫ్యాన్స్ పండ‌గ చేసుకుంటారో..లేక సినిమాను ఏప్రిల్‌కే విడుద‌ల చేయాల‌ని పేచీ పెడ‌తారో చూడాలి. 

mahesh babu special treat

maharshi
mahesh babu
mahesh
vamsi paidipalli
dil raju
aswanidutt
pvp prasad
allari naresh
srimanthudu