నాగబాబు ఎండ్ చేయడానికి కారణమిదేనా?

Sat 12th Jan 2019 12:07 AM
nagababu,balakrishna,6th comment,end  నాగబాబు ఎండ్ చేయడానికి కారణమిదేనా?
Nagababu and Balayya Controversy Ended నాగబాబు ఎండ్ చేయడానికి కారణమిదేనా?
Sponsored links

గత కొన్ని రోజులుగా బాలకృష్ణని ఫుడ్ బాల్ ఆడుకుంటున్న నాగబాబు నిన్న రాత్రి బాలయ్యని ఆడుకునే ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పెట్టేశాడు. గత కొన్ని రోజులు బాలకృష్ణ ఎప్పుడో మెగా ఫ్యామిలీ హీరోలను ఉద్దేశించి అన్నమాటలను ఒక్కొక్కటిగా.. నాగబాబు వివరిస్తూ... బాలకృష్ణ మీద ఒక వీడియోని తయారుచేసి.. చాప్టర్ వన్, టు అంటూ ఫేస్ బుక్ లో పోస్ట్ చేస్తూ బాలకృష్ణ మీద రివెంజ్ తీర్చుకునే ప్రోగ్రాం పెట్టుకున్నాడు. ఎప్పుడో బాలయ్య కామెంట్స్ చేస్తే.. లేటెస్ట్ గా నాగబాబు స్పందించడంపై మీడియాలో వస్తున్న వార్తలకు నాగబాబు నా ఇష్టం వచ్చినప్పుడు స్పందిస్తా అంటూ.. ఘాటైన వ్యాఖ్యలతో బాలయ్య ఎపిసోడ్ కి ఫుల్ స్టాప్ పెట్టాడు. బాలయ్యని విమర్శిస్తున్న నాగబాబుని, నందమూరి అభిమానులు ఎంతగా ఇరికిస్తున్నా పట్టించుకోకుండా నాగబాబు తన పని తానూ చేసుకుపోయాడు.

ఇప్పటివరకు తన అన్న చిరు ఇచ్చిన సంస్కారం తనని మాట్లాడకుండా ఆపింది అని... 2012  లో బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ కాలిగోటికి కూడా చిరంజీవి సరిపోడని అన్నాడని.. అప్పుడు మా రక్తం ఉడికిపోయిందని... కానీ మా అన్నయ్య చిరు మాత్రం బాలయ్య చిన్నపిల్లాడు ఏదో తెలియకుండా మాట్లాడుతుంటాడని.. చాలా హుందాగా ప్రవర్తించాడని చెప్పుకొచ్చాడు. ఎవరికైనా వారి తండ్రులు వారికి గొప్పవారే అవుతారని.. అలాగే మా అన్న మాకు గొప్ప అంటూ బాలయ్యపై విరుచుకుపడ్డాడు. ఇక బాలకృష్ణ... తమ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేసిన ఊరుకోమని.. దానికి తగిన సమాధానం చెబుతామని నందమూరి అభిమానులకు హెచ్చరికలు జారీ చేశాడు. అయితే నాగబాబు, బాలకృష్ణ ఎపిసోడ్ కి ఇలా ఎండ్ కార్డు వెయ్యడానికి తమ కొడుకులే అనే మాట సోషల్ మీడియాలో వినబడుతుంది.

నాగబాబు అన్న కొడుకు రామ్ చరణ్ నటించిన వినయ విధేయ రామ ఈ రోజే ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అలాగే ఆయన కొడుకు వరుణ్ తేజ్ నటించిన ఎఫ్ టు రేపు శనివారం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇలాంటి టైంలో బాలకృష్ణ మీద ఇంకా యుద్దానికి పోతే కొడుకుల సినిమాల మీద ఎఫెక్ట్ పడే అవకాశం ఉందని నాగబాబు తగ్గాడని.. అందుకే బాలకృష్ణకి సుతిమెత్తని హెచ్చరికలు జారీ చేసి మరీ.. ఈ వివాదానికి ఎండ్ కార్డు వేశాడని అంటున్నారు. 

Sponsored links

Nagababu and Balayya Controversy Ended:

Nagababu 6th Comment on Balakrishna

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019