‘మిస్టర్ మజ్ను’ టీజర్: హిట్ టచ్చే కనబడుతోంది

Mr Majnu Teaser Released Mr Majnu Teaser Released

అఖిల్ అక్కినేని హీరోగా శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పి పతాకంపై ‘తొలిప్రేమ’ ఫేం వెంకీ అట్లూరి దర్శకత్వంలో భారీ నిర్మాత బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్ నిర్మిస్తున్న యూత్‌పుల్ ఎంటర్‌టైనర్ ‘మిస్టర్ మజ్ను’. ఈ చిత్రాన్ని అన్ని కార్యక్రమాలు పూర్తి చేసి జనవరి 25న ఈ చిత్రాన్ని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కాగా, ఈ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను బుధవారం విడుదల చేశారు. ఈ టీజర్‌లోని అఖిల్ స్టెప్స్, యాక్షన్ సీక్వెన్స్ అద్భుతంగా ఉన్నాయి. అలాగే ‘మీరు స్టూడెంట్‌గా ఉన్నప్పుడు, స్ట్రెస్ ఫీల్ అయినపుడు మీరేం చేసేవారు?’ అంటూ అఖిల్ అడిగిన ప్రశ్నకు ‘చాక్లెట్ తినేదాన్ని’ అని ఓ అమ్మాయి చెప్పిన సమాధానానికి అఖిల్ ‘ఆరోజుల్లో చాక్లెట్స్‌తో పనైపోయేది. కానీ, టుడేస్ స్ట్రెస్ లెవల్స్‌కి హ్యూమన్ టచ్ కావాలి’, ‘ప్రపంచంలోని అందరమ్మాయిలు నా ఒక్కడి కోసమే పుట్టలేదు నిక్కీ.  వాళ్ళకీ ఓ లైఫ్ ఉంటుంది. అండ్ ఐ రెస్పెక్ట్ దట్’ అంటూ అఖిల్ అక్కినేని చెప్పే డైలాగ్స్ యూత్‌కి బాగా కనెక్ట్ అవుతాయి. అలాగే థమన్ ఇచ్చిన మ్యూజిక్ కూడా యూత్‌ఫుల్‌గా ఉంది. 

అఖిల్ అక్కినేని సరసన నిధి అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రంలో నాగబాబు, ప్రియదర్శి, జయప్రకాష్, హైపర్ ఆది ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. 

ఈ చిత్రానికి సంగీతం: థమన్, పాటలు: శ్రీమణి, సినిమాటోగ్రఫీ: జార్జ్ సి. విలియమ్స్, ఎడిటింగ్: నవీన్ నూలి, ఆర్ట్: అవినాష్ కొల్లా, కొరియోగ్రఫీ: శేఖర్, నిర్మాత: బి.వి.ఎస్.ఎన్.ప్రసాద్, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: వెంకీ అట్లూరి.

Click Here for Teaser

Akkineni Akhil Mr Majnu Teaser Talk

mr majnu
teaser talk
akhil akkineni
mr majnu movie
akhil mr majnu teaser talk