సూపర్ స్టార్.. అరుదైన రికార్డు..!

సూపర్ స్టార్ రజినీకాంత్ - శంకర్ కాంబినేషన్ లో తెరకెక్కిన విజువల్ వండర్ ‘2.ఓ’. అక్షయ్ కుమార్ ప్రతినాయకుడిగా నటించిన ఈ సినిమా వసూల్ పరంగా దూసుకుపోతుంది. మొదటి రోజు డివైడ్ టాక్ ఓపెనింగ్ బాగానే చేసింది. తొలిరోజు నుండే రికార్డులను నమోదు చేయడం మొదలుపెట్టిన ఈ సినిమా రీసెంట్ గా మరో అరుదైన ఘనతను సొంతం చేసుకుంది. 

తమిళ.. తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్ లో కూడా ఒక ఊపు ఊపేస్తున్న ఈసినిమా అంతర్జాతీయ బాక్సాఫీస్ దగ్గర  700 కోట్ల (100 మిలియన్ డాలర్స్)ను వసూలు చేయడం విశేషం. ఈ ఏడాది ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే 100 మిలియన్ డాలర్స్ ను రాబట్టిన చిత్రాలు 53 ఉంటే... అందులో ఇండియా నుండి 2 ఉన్నాయి.

ఇండియా నుండి అమీర్ ఖాన్ నటించిన ‘సీక్రెట్ సూపర్ స్టార్’ తో పాటు రజనీ ‘2.ఓ’ చిత్రాలు  ప్రపంచవ్యాప్తంగా 100 మిలియన్ డాలర్స్ ను రాబట్టాయి. అమీర్  ‘సీక్రెట్ సూపర్ స్టార్’ చైనా వసూళ్లతో కలుపుకుని ఈ జాబితాలో చేరింది. ‘2.ఓ’ మాత్రం చైనా వసూళ్లతో సంబంధం లేకుండగానే ఈ జాబితాలో చేరడం విశేషం. ఇద్దరు సూపర్ స్టార్స్ ఒకే రికార్డును క్రియేట్ చేయడం విశేషం.

2.0 Creates Superb Record

Great Record in Super Star Account
rajinikanth
2.0 movie
record
aamir khan
secret superstar
movie
Advertisement
Advertisement