బన్నీ పిక్చర్ పరశురామ్‌తో కాదట..!

Sat 29th Dec 2018 07:06 AM
allu arjun,sacrifice,sai dharam tej,trivikram srinivas,parasuram,allu arjun movie  బన్నీ పిక్చర్ పరశురామ్‌తో కాదట..!
Allu Arjun not in Parasuram project బన్నీ పిక్చర్ పరశురామ్‌తో కాదట..!
Sponsored links

మొన్నటివరకు అల్లు అర్జున్‌తో త్రివిక్రమ్ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. కానీ త్రివిక్రమ్ చెప్పే లైన్స్ కి బన్నీ పెద్దగా కనెక్ట్ అవ్వకపోవడంతో తన మనసు మార్చుకుని ‘గీత గోవిందం’ లాంటి సూపర్ హిట్ చిత్రంను తెలుగు ప్రేక్షకులకి ఇచ్చిన  పరశురామ్‌తో సినిమా చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. పరశురామ్ బన్నీ కి ట్రయాంగులర్ లవ్ స్టోరీ చెపితే బన్నీ దానికి వెంటనే కనెక్ట్ అయ్యి ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయమని చెప్పాడట.

సో అలా త్రివిక్రమ్ కి హ్యాండ్ ఇచ్చి పరశురామ్ తో చేయడానికి బన్నీ రెడీ అయ్యాడు. అయితే గత కొంత కాలం నుండి సాయి ధరమ్ తేజ్ కు సరైన హిట్ ఒక్కటి కూడా లేదు. ప్రస్తుతం కెరీర్ పరంగా ఇబ్బంది పడుతున్న సాయి ధరమ్ కోసం  బన్నీ ఒక అడుగు ముందుకు వేసి తనకంటే ఈ సినిమా సాయిధరమ్ తేజ్ కి ఎక్కువ అవసరం అని భావించిన బన్నీ, ఆ సినిమాను సాయిధరమ్ తేజ్ తో చేయమని పరశురామ్ తో చెప్పాడట.

అందుకే పరశురామ్ నుండి డ్రాప్ అయ్యి మళ్లీ త్రివిక్రమ్ వైపు వెళ్తున్నాడు బన్నీ. మరి త్రివిక్రమ్ ఏమో చిరంజీవితో ఓ సినిమా చేయడానికి రెడీ గా ఉన్నాడు. ఈనేపధ్యంలో త్రివిక్రమ్ మొదటిగా ఎవరితో స్టార్ట్ చేస్తాడు అన్నది తెలియాల్సిఉంది. ముందుగా అనుకున్న ప్రకారం బన్నీ తోనే స్టార్ట్ చేసే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.

Sponsored links

Allu Arjun not in Parasuram project:

Sai Dharam Tej in Parasuram Project

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019