`ఖ‌డ్గం` పాప‌తో హ‌ర్ష‌వ‌ర్థ‌న్ డేటింగ్‌!

harshavardhan rane dating kim sharmaharshavardhan rane dating kim sharma

క్రియేటీవ్ డైరెక్ట‌ర్ కృష్ణ‌వంశీ రూపొందించిన `ఖ‌డ్గం` సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు చేరువైంది బాలీవుడ్ సోయ‌గం కిమ్‌శ‌ర్మ‌. తొలి సినిమాతోనే `ముసుగు వేయొద్దు మ‌న‌సు మీద‌..` అంటూ కుర్ర‌కారు గుండెల్లో మంట‌పెట్టిన ఈ బాలీవుడ్ చిన్న‌ది  `మ‌గ‌ధీర‌`లోనూ ఓ పాట‌లో మెరిసింది. ఆ త‌రువాత తెలుగు సినిమాల్లో క‌నిపించ‌లేదు. బాలీవుడ్ చిత్రాల‌కు ప‌రిమిత‌మైపోయిన కిమ్‌కు గ‌త కొంత కాలంగా అక్క‌డ కూడా అవ‌కాశాలు పెద్ద‌గా లేవు. అయితే సినిమాలు లేక‌పోతేనేం జంట‌గా తిర‌గ‌డానికి ఓ బాయ్ ఫ్రెండ్ దొరికాడు. కొంత కాలంగా కిమ్‌శ‌ర్మ టాలీవుడ్ హీరోతో డేటింగ్ చేస్తోంది. ఎక్క‌డికి వెళ్లినా ఈ ఇద్ద‌రే క‌లిసి జంట‌గా తిరిగేస్తున్నారు. 

 

బాలీవుడ్ మీడియా కంట‌ప‌డ‌టంతో వీరి బండారం బ‌య‌ట‌ప‌డింది. కిమ్‌తో డేటింగ్ చేస్తున్న టాలీవుడ్ హీరో మ‌రెవ‌రో కాదు హ‌ర్ష‌వ‌ర్థ‌న్‌రాణే. భూమిక నిర్మించిన `త‌కిట త‌కిట‌`, ర‌విబాబు `అవును`, శేఖ‌ర్ క‌మ్ముల, న‌య‌న‌తార‌ల `అనామిక‌` చిత్రాల్లో ప్రాధాన్య‌త‌లేని పాత్ర‌ల్లో మెరిసిన హ‌ర్ష‌వ‌ర్థ‌న్ తెలుగులో అవ‌కాశాలు లేకపోవ‌డంతో ఈ మ‌ధ్య బాలీవుడ్ బాట‌ప‌ట్టాడు. అక్క‌డే కిమ్‌తో ప‌రిచ‌యం ఏర్ప‌డ‌టంతో గ‌త కొంత కాలంగా త‌న‌తో డేటింగ్ చేస్తున్నాడు. ఈ మ‌ధ్యే ఈ జంట మీడియా కంట‌ప‌డ‌టంతో హ‌ర్ష‌వ‌ర్థ‌న్ తమ రిలేష‌న్ షిప్ గురించి బ‌య‌ట‌పెట్టేశాడు. 

 

`అవును ఇద్ద‌రం డేటింగ్‌లో వున్నాం. అది నా వ్య‌క్తిగ‌త విష‌యం దాని గురించి ఎవ‌రికీ చెప్పాల్సిన ప‌నిలేదు` అని తేల్చి చెప్పాడ‌ట‌. అన్న‌ట్టు వీరిద్ద‌రూ త్వ‌ర‌లో పెళ్లి చేసుకోబోతున్న‌ట్టు తెలిసింది. ఇద్ద‌రి అభిరుచులు క‌ల‌వ‌డంతో త్వ‌ర‌లోనే  ఓ ఇంటివారు కావాల‌నుకుంటున్నార‌ట‌. వీరి పెళ్లికి ఇరు కుటుంబాల పెద్ద‌లు కూడా గ్రీన్ సిగ్న‌ల్ ఇవ్వ‌డంతో హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ రాణే సంతోషానికి హ‌ద్దులే లేకుండా పోయాయాని చెబుతున్నారు.

kim dating with harshavardhan

kim
harshavardhan rane
khadgam
avunu
takita takita
anamika
harshavardhan
kim sharma
magadheera