RRR: ఈ వార్తలు నిజమేనా..?

One More Gossip on RRR MovieOne More Gossip on RRR Movie

ప్రస్తుతం దేశమొత్తం ఎంతో ఎదురుచూస్తున్న మోస్ట్‌ ఎవైటెడ్‌ మూవీ ‘బాహుబలి’ తర్వాత రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్‌చరణ్‌లు నటించే అసలు సిసలైన మల్టీస్టారర్‌ అనే చెప్పాలి. ఇటీవలే ఈ చిత్రం మొదటి షెడ్యూల్‌ పూర్తయింది. హైదరాబాద్‌ శివార్లలో సెట్స్‌వేసి యాక్షన్‌ సన్నివేశాలను కనీవినీ ఎరుగని రీతిలో వందలాది కెమెరాల నడుమ చిత్రీకరించారు. ఎక్కువభాగం షూటింగ్‌ ఈ సెట్స్‌లోనే జరగనుండటంతో జక్కన్నఈ సెట్స్‌లోనే తన కోసం ఏకంగా ఓ ఇంటిని నిర్మించుకున్నాడని కూడా వార్తలు వచ్చాయి. 

ఇక ఈ చిత్రం ఏ ముహూర్తాన బయటకు వచ్చిందో గానీ ఈ మూవీ గురించి రోజుకో వార్త దేశవ్యాప్తంగా హల్‌చల్‌ చేస్తోంది. తాజాగా ఈ మూవీ ఆంగ్లేయులు కాలం నాటి బ్యాక్‌డ్రాప్‌తో రూపొందుతోందని వార్తలు వస్తున్నాయి. రామ్‌చరణ్‌ బ్రిటిష్‌ కాలం నాటి పోలీస్‌ అధికారి పాత్రను పోషిస్తుండగా, ఎన్టీఆర్‌ ఓ ముస్లిం యువకుడైన బందిపోటు దొంగ పాత్రలో నటిస్తున్నాడని తాజాగా వార్తలు షికార్లు చేస్తున్నాయి. ఇందులో రామ్‌చరణ్‌, ఎన్టీఆర్‌లు నటిస్తూ ఉండటం, రాజమౌళి దర్శకత్వం వహిస్తుండగా, దానయ్య నిర్మాత, విజయేంద్రప్రసాద్‌ కథ, కీరవాణి సంగీతం మినహా మిగిలిన ఏ విషయంపై కూడా క్లారిటీ లేదు. 

ఏ విషయమైనా రాజమౌళి నోరు విప్పితే గానీ బయటకు రాదు. అప్పటివరకు వీటన్నింటినీ గాలి వార్తలు గానే పరిగణించాల్సి వుంటుంది. మరి రాజమౌళి ఈ చిత్ర సంగతులపై ఎప్పుడు స్పందిస్తాడో వేచిచూడాల్సివుంది..!

Again Rumours on RRR Movie

rrr
rajamouli
rumours
rrr movie story
ram charan
jr ntr