సుకుమార్ సైలెంట్‌గా చేసేస్తున్నాడుగా..!!

Sun 09th Dec 2018 02:57 PM
mahesh babu,sukumar,rakul preet singh,script ready,mahesh and sukku movie details  సుకుమార్ సైలెంట్‌గా చేసేస్తున్నాడుగా..!!
Sukumar and Mahesh Babu Movie Project Updates సుకుమార్ సైలెంట్‌గా చేసేస్తున్నాడుగా..!!
Sponsored links

సుకుమార్ కథకి మహేష్ ఇంప్రెస్ అవ్వలేదు.. మహేష్‌ని శాటిస్‌ఫై చేయలేకపోతున్న సుకుమార్.. ఇవి గత నెల నుండి సోషల్ మీడియాలో మహేష్ - సుకుమార్ ప్రాజెక్ట్ మీద వినబడుతున్న రూమర్స్. సుకుమార్ చారిత్రక నేపథ్యంతో ఉన్న కథను మహర్షి షూటింగ్ లో ఉన్న మహేష్ కి వినిపించాడట. అయితే ఆ సినిమా వర్కౌట్ అవ్వదని... మరో కథని సిద్ధం చేయమని మహేష్, సుకుమార్‌కి చెప్పినట్లుగా వార్తలొస్తున్నాయి. మహర్షి సినిమా షూటింగ్ ఫినిష్ కాగానే సుకుమార్‌తో కమిట్ అయిన మహేష్.. ఆ సినిమా షూటింగ్ పూర్తి కాగానే 10 రోజుల గ్యాప్‌తో సుక్కు మూవీకి రెడీ అవుతాడు. రంగస్థలంతో తిరుగులేని హిట్ కొట్టిన సుకుమార్‌పై ఎంతో నమ్మకంగా ఉన్నమహేష్.. తను కూడా రంగస్థలం వంటి హిట్ కొట్టాలని, అందుకు సరిపడిన కథతో రావాలని చెప్పుతుండటంతో రోజుకో వార్త సోషల్ మీడియాలో షికార్లు చేస్తున్నాయి.

ఈ వార్తలు అలా వస్తూనే ఉన్నాయి. కానీ సుకుమార్ మాత్రం కొత్త కథతో మహేష్‌కి లైన్ వినిపించడం.. మహేష్ దానికి ఓకే చెప్పేయడం జరిగిపోయిందని.. అప్పుడే సుకుమార్, మహేష్ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనుల్లోకి దూకేశాడని విశ్వసనీయ సమాచారం. ఇక సుకుమార్ మరోమారు నాన్నకు ప్రేమతో కథలాంటి మైండ్ గేమ్ తరహాలోనే మహేష్ కోసం ప్రిపేర్ చేశాడని... ఇక ఆ సినిమా కోసం మరోసారి మహేష్ సరసన జోడిగా నటించేందుకు రకుల్ ప్రీత్ ని హీరోయిన్ గా సెలెక్ట్ చేసాడని అంటున్నారు. నాన్నకు ప్రేమతో సినిమాలో ఎన్టీఆర్ కి జోడిగా సుకుమార్ దర్శకత్వంలో నటించిన రకుల్.. ఈసారి మహేష్ సరసన నటిస్తుందట.

మరి మహేష్ సరసన ఆల్రెడీ స్పైడర్ వంటి డిజాస్టర్ సినిమాలో నటించిన రకుల్.. స్పైడర్ తర్వాత టాలీవుడ్‌లో సినిమాలు లేక ఖాళీగా ఉంది. స్పైడర్‌తోనే క్రేజ్ పోగొట్టుకున్న రకుల్ ప్రీత్ మరోమారు మహేష్‌తో నటించి మళ్ళీ క్రేజ్ లోకొస్తుందేమో చూడాలి. అయితే సుకుమార్ - మహేష్ కాంబోలో రకుల్ హీరోయిన్ అనే విషయం ఇంకా ధ్రువీకరించలేదు. 

Sponsored links

Sukumar and Mahesh Babu Movie Project Updates:

Script Ready To Mahesh Babu and Sukumar Movie

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019