బన్నీ, త్రివిక్రమ్.. మూవీ అప్‌డేట్ ఇదే!

Fri 23rd Nov 2018 11:52 AM
allu arjun,no remake,fresh story,trivikram srinivas,allu arjun next film  బన్నీ, త్రివిక్రమ్.. మూవీ అప్‌డేట్ ఇదే!
Allu Arjun and Trivikram Movie Latest Update బన్నీ, త్రివిక్రమ్.. మూవీ అప్‌డేట్ ఇదే!
Sponsored links

ప్రస్తుతం అల్లు అర్జున్... కూతురు అర్హ బర్త్ డే సెలెబ్రేషన్స్ కోసం గోవా లో ఉన్నాడు. తాజాగా అల్లు అర్హ బర్త్ డే వేడుకలు గోవాలో ఘనంగా జరిగాయి. అల్లు అర్జున్, స్నేహ అంతా కలిసి ఈ సెలెబ్రేషన్స్ లో ఎంజాయ్ చేశారు. అయితే అల్లు అర్జున్ ఇలా పార్టీలు అంటూ ఎంజాయ్ చేస్తున్నాడు కానీ...తన నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏ డైరెక్టర్ తో చేస్తున్నాడో అనేది మాత్రం చెప్పకుండా తాత్సారం చేస్తూనే ఉన్నాడు. విక్రమ్ కుమార్ తో సినిమా అని ఎప్పటి నుంచో విక్రమ్ కుమార్ ని హోల్డ్ లో పెట్టిన అల్లు అర్జున్ ఇక త్రివిక్రమ్ తో సినిమా ఫైనల్ అన్నప్పటికీ... ఇంకా ఆ సినిమా మీద క్లారిటీ ఇవ్వడం లేదు. ఈ సినిమా విషయంలో అటు అల్లు అర్జున్ కానీ... ఇటు త్రివిక్రమ్ కానీ మాట్లాడకుండా సైలెంట్ గానే ఉంటున్నారు.

అయితే త్రివిక్రమ్ - అల్లు అర్జున్ మధ్య కథా చర్చలు ఎడతెగకుండా నడుస్తూనే ఉన్నాయంటున్నారు. ముందుగా హిందీ ఫిలిం సోను కి టీటూ కీ స్వీటీ ని రీమేక్ చేద్దామనుకున్నారు. కానీ ఎందుకో వెనక్కి తగ్గారు. అయితే రీమేక్ రైట్స్ విషయంలో ఏదో తేడా వచ్చిందంటున్నారు. అల్లు అర్జున్ కి ఆ రీమేక్ మీద కన్నుంది. కాదు కాదు ఎలాగైనా సోను కి టీటూ కీ స్వీటీ సినిమానే రీమేక్ చెయ్యాలనుంది. కానీ త్రివిక్రమ్ మాత్రం ఫ్రెష్ కథతో సినిమా స్టార్ట్ చేద్దామంటున్నాడట. కానీ త్రివిక్రమ్ టాలెంట్ అజ్ఞాతవాసి, అ...ఆ విషయంలో ఏమైందో బన్నీ కి అనుభవంలోనే ఉంది. అందుకే త్రివిక్రమ్ ఫ్రెష్ కథంటే అల్లు అర్జున్ కి నమ్మబుద్దికావడం లేదట. 

ఇక త్రివిక్రమ్ మాత్రం మళ్ళీ రీమేక్ తో సినిమా చేస్తే తన టాలెంట్ మీదున్న నమ్మకం స్టార్ హీరోలకి పోతుందనే భయంతోనే ఫ్రెష్ కథ అంటూ బన్నీని ఇంప్రెస్ చేసే పనిలో ఉన్నాడట. ఇక అల్లు అర్జున్ కూడా మంచి కథ రెడీ చేస్తే హిందీ మూవీ రీమేక్ వదిలేద్దామని త్రివిక్రమ్ కి మాటిచ్చినట్లుగా తెలుస్తుంది. మరోపక్క కేవలం మాట మాత్రమే కాదు.. ఇప్పటికే త్రివిక్రమ్ కొత్తగా స్టోరీ లైన్ ని బన్నీ కి వినిపించాడని... ప్రస్తుతం ఆ కథ గురించిన కసరత్తు మొదలైందని అంటున్నారు. మరి కథ పూర్తిగా సెట్ చేసుకున్నాకే త్రివిక్రమ్, అల్లు అర్జున్ లు పక్కాగా సెట్స్ మీదకెళ్తారని తెలుస్తుంది.

Sponsored links

Allu Arjun and Trivikram Movie Latest Update:

Trivikram Srinivas Gives Fresh Story to Allu Arjun 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019