Advertisement

మెగాభిమానులకు మరో గుడ్ న్యూస్..!!

Good News to Mega Fans

Wed 07th Nov 2018 09:19 PM
chiranjeevi,daughter,kalyaan dhev,wife,sreeja pregnant  మెగాభిమానులకు మరో గుడ్ న్యూస్..!!
Good News to Mega Fans మెగాభిమానులకు మరో గుడ్ న్యూస్..!!
Advertisement

మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ సినిమాతో ఇండస్ట్రీ రికార్డులు కొల్లగొట్టి బాస్ ఈజ్ బ్యాక్ అని నిరూపించారు. ఫ్యాన్స్ కు ఇదొక గుడ్ న్యూస్. ఆ ఊపుతోనే చిరంజీవి తన నెక్స్ట్ మూవీ ‘సైరా-నరసింహారెడ్డి’ని పూర్తి చేసే పనిలో నిమగ్నమై ఉన్నాడు. రామ్ చరణ్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ సినిమాను రూపొందిస్తున్నాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టీజర్ చూస్తే అర్ధం అవుతుంది ఈసినిమా ఎలా ఉండబోతుందో అని. ఇది ఇలా ఉండగా మెగా ఫ్యాన్స్ కి మరో శుభవార్త.

చిరంజీవి చిన్న కూతురు శ్రీజ, కళ్యాణ్ దేవ్ జంట పండంటి బిడ్డకు జన్మనివ్వబోతున్నారన్నదే ఆ శుభవార్త. ఈ విషయాన్నీ స్వయంగా కళ్యాణ్ దేవ్ తన సోషల్ మీడియా అకౌంట్ లో ఇద్దరూ కలిసి ఉన్న ఫోటో పెట్టి  ‘బేబి2#లోడింగ్’ అని ఆ ఫోటోను షేర్ చేశాడు. దాంతో మెగా ఫ్యామిలీ మొత్తం హ్యాపీగా ఉంది. శ్రీజ తొలి సంతానం కుమార్తె నివృతి.

శ్రీజ మొదటి భర్త భరద్వాజ్ తో కొన్ని కారణాలు వల్ల విడాకులు అయిన సంగతి తెలిసిందే. ఆ తరువాత నుండి నివృతి ఈమె దగ్గరే పెరుగుతుంది. మరి చరణ్ - ఉపాసన ఎప్పుడు ఆ గుడ్ న్యూస్ ని చెపుతారో అని మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. వీరిద్దరూ ఒక అండర్ స్టాండింగ్ మీద ఉన్నట్టు తెలుస్తుంది.

Good News to Mega Fans:

Chiranjeevi daughter and Kalyaan Dhev wife Sreeja is pregnant


Loading..
Loading..
Loading..
advertisement