సీఎం కొడుకుతో మోహన్ వడ్లపట్ల చిత్రం!

Wed 07th Nov 2018 02:36 PM
mohan vadlapatla,nikhil,jaguar,kumuara swamy son,karnataka cm,new movie  సీఎం కొడుకుతో మోహన్ వడ్లపట్ల చిత్రం!
Mohan Vadlapatla Movie with Chief Minister Son సీఎం కొడుకుతో మోహన్ వడ్లపట్ల చిత్రం!
Sponsored links

మోహన్ మీడియా క్రియేషన్స్ బ్యానర్ లో ‘మల్లె పువ్వు, మెంటల్ కృష్ణ’, నంది అవార్డు పొందిన ‘కలవరమాయే మదిలో’ వంటి మంచి చిత్రాలను నిర్మించిన మోహన్ వడ్లపట్ల కొన్నాళ్లుగా నిర్మాతలమండలి మరియు ఫిలిం ఛాంబర్ లో కొన్ని కీలక బాధ్యతలు నిర్వహిస్తూ నిర్మాణ రంగానికి కొన్ని రోజుల పాటు దూరంగా ఉన్నారు. నిర్మాతగా ఇన్నాళ్లు సైలెంట్ గా ఉన్న మోహన్ వడ్లపట్ల ఒక భారీ చిత్రాన్ని పూర్తిగా అమెరికాలో ప్రాధాన్యత కలిగిన అనేక ప్రాంతాల్లో నిర్మించడానికి భారీగా సన్నాహాలు చేస్తున్నారు. ఇప్పటికే అమెరికాలో ఈ చిత్రానికి సంబంధించిన లొకేషన్స్‌కు  అనుమతులు మంజూరు చేయించుకున్నారు. అయితే తాను నిర్మిస్తున్న చిత్రం యూనిట్ కి వీసాలు మంజూరి కావడంలో జాప్యం జరుగుతుండంతో ఈ లోపు... హై టెక్నీకల్ వేల్యూస్ ఉన్న ఒక దర్శకుడు చెప్పిన కథ నచ్చడంతో... ఆ కథతో ఒక భారీ చిత్రాన్ని మోహన్ వడ్లపట్ల.. కర్ణాటక ముఖ్యమంత్రి కుమార స్వామి కొడుకు, జాగ్వార్ ఫేమ్ నిఖిల్ తో ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. కథ బావుండడంతో ఈ చిత్రాన్ని తెలుగు, కన్నడ రెండు భాషల్లో అతిత్వరలోనే నిర్మించడానికి సన్నాహాలు మొదలు పెట్టినట్లుగా ఫిలింనగర్ టాక్. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.

Sponsored links

Mohan Vadlapatla Movie with Chief Minister Son:

Mohan Vadlapatla and Nikhil Combo film soon

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019