Advertisement

వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా మూవీ ఫిక్సయింది

మైత్రీ మూవీ మేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్స్‌ సంయుక్తంగా ఓ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. ఈ చిత్రంతో మెగా కాంపౌండ్‌ నుంచి మరో హీరో పరిచయం కానున్నారు. ఆయన మరెవరో కాదు.. మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడు, సాయిధరమ్‌తేజ్‌ సోదరుడు వైష్ణవ్‌ తేజ్‌. ఈ సినిమాకు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహించనున్నారు. బుచ్చిబాబు సానా  ఇంతకు ముందు సుకుమార్‌ దగ్గర దర్శకత్వశాఖలో పనిచేశారు. ఇటీవల ‘రంగస్థలం’ చిత్రానికి రైట‌ర్‌గా కూడా పనిచేశారు.  ఈ నూత‌న చిత్రానికి ప‌నిచేసే ఆర్టిస్టులు, టెక్నీషియన్ల పేర్లను త్వరలోనే వెల్లడించనున్నారు. దేవిశ్రీ ప్ర‌సాద్ సంగీతాన్ని స‌మ‌కూర్చ‌నున్నారు.

Mega Launch for One More Mega Hero

Vaishnav Tej's Debut Film Soon
vaishnav tej
debut film
sai dharam tej
launch