రకుల్‌ కన్నా తమ్ము అయితే బాగుండేదంట!!

Sat 13th Oct 2018 08:00 PM
rakul preet singh,tamanna,sri devi role,ntr biopic  రకుల్‌ కన్నా తమ్ము అయితే బాగుండేదంట!!
Negative Comments on Rakul Look in NTR Biopic రకుల్‌ కన్నా తమ్ము అయితే బాగుండేదంట!!
Sponsored links

తెలుగులో నాటి నుంచి నేటి వరకు గొప్ప గొప్ప డ్యాన్సర్లుగా పేరుతెచ్చుకున్న ఏయన్నార్‌, చిరంజీవి, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్‌, రామ్‌ వంటి ఎందరో మనకి కనిపిస్తారు. ఇక నాటి ఏయన్నార్‌ కాలంలో వాణిశ్రీతో పాటు తర్వాత ఏయన్నార్‌, మెగాస్టార్‌ చిరంజీవితో కూడా నటించిన అతిలోక సుందరి శ్రీదేవి, ఆ తర్వాత రాథ, రంభ కూడా డ్యాన్స్‌లో అందరితో పోటీ పడుతుంది. ఇక డిస్కోశాంతి, సిల్క్‌స్మిత, జ్యోతిలక్ష్మి వంటి ఐటం సాంగ్స్‌ వేసేవారు కూడా బాగా డ్యాన్స్‌ చేస్తారు. నేడు మాత్రం ప్రస్తుతం ఉన్న హీరోయిన్లలో తమన్నాకి మంచి డ్యాన్సర్‌గా పేరుంది. ఆమె హీరోలతో పోటీ పడి నాట్యం చేస్తూ ఉంటుంది. ఇక నాడు చిరంజీవి సైతం మీకు ఈ తరం హీరోయిన్లలలో ఎవరితో డ్యాన్స్‌ చేస్తూ, స్టెప్స్‌ వేయాలని ఉంది? అని అడిగితే తమన్నా పేరే చెప్పాడు. 

ఇక విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్‌ బయోపిక్‌గా ఆయన కుమారుడు నటసింహం బాలకృష్ణ తన తండ్రి పాత్రలో చేస్తోన్న చిత్రం రెండు పార్ట్‌లుగా విడుదల కానుంది. ఇక రెండో భాగం కేవలం రాజకీయ పయనం మీదనే కావడంతో దానిలో సినిమా వారి పాత్రలకు పెద్దగా ప్రాధాన్యం ఉండకపోవచ్చు. కానీ మొదటి భాగంలో మాత్రం అంతా ఎన్టీఆర్‌తో కలిసి నటించిన, పనిచేసిన పలు పాత్రలు కనిపిస్తాయి. అందులో ఓ ముఖ్యమైన పాత్ర అతిలోక సుందరి శ్రీదేవిది. ఆమె ఎన్టీఆర్‌తో కలసి ఎన్నో బ్లాక్‌బస్టర్‌ చిత్రాలలో నటించింది. ఇక ఎన్టీఆర్‌ బయోపిక్‌లో శ్రీదేవి పాత్రను రకుల్‌ ప్రీత్‌సింగ్‌ చేత చేయిస్తున్నారు. ఇప్పటికే 'వేటగాడు' చిత్రంలోని 'ఆకుచాటు పిందె తడిసె' పాట చిత్రీకరణ పూర్తి కావడమే కాదు.. వాటి స్టిల్‌ కూడా బయటకు వచ్చింది. ఈ మూవీలో రకుల్‌ పాత్ర 20 నిమిషాల వరకు ఉంటుందిట. అయినా ఆ పాత్రకు రకుల్‌ కోటి డిమాండ్‌ చేసి సాధించిందని వార్తలు వస్తున్నాయి. తెలుగు, తమిళ భాషల్లో రకుల్‌కి మంచి క్రేజ్‌ ఉంది. 

ఇక బాలీవుడ్‌లో కూడా అడపాదడపా నటిస్తూ అక్కడ కూడా గుర్తింపు తెచ్చుకుంది. ఈ కారణంగానే ఆమె డిమాండ్‌ చేసినంత ఇవ్వడానికి నిర్మాతలు ఒప్పుకున్నారట. అయితే శ్రీదేవి లుక్‌లో రకుల్‌ సరిగా ఆకట్టుకోలేదనే విమర్శలు వస్తున్నాయి. మరి సినిమాలో అయినా నటనపరంగా, డ్యాన్స్‌ల పరంగా కూడా శ్రీదేవి తరహాలో రకుల్‌ ఏమాత్రం మెప్పిస్తుందో వేచిచూడాల్సివుంది. ఇక ఈ పాత్రకి రకుల్‌ కంటే తమన్నా అయితే బాగుండేదని పలువురు అనుకుంటున్నారు. 

Sponsored links

Negative Comments on Rakul Look in NTR Biopic:

Tamanna Better Than Rakul for Sridevi Role

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019