చిరంజీవితో సినిమా ఉంటే గర్వంగా చెబుతాం!

Sat 13th Oct 2018 06:24 PM
chiranjeevi,152 film,vyjayanthi banner,ashwini dutt  చిరంజీవితో సినిమా ఉంటే గర్వంగా చెబుతాం!
Ashwini Dutt Clarity on Chiranjeevi 152 Film చిరంజీవితో సినిమా ఉంటే గర్వంగా చెబుతాం!
Sponsored links

నేటి సీనియర్‌ నిర్మాతల్లో వైజయంతి అధినేత సి.అశ్వనీదత్‌కి ప్రత్యేకస్థానం ఉంది. 1974లో 'ఓ సీత కథ' అనే చిన్న చిత్రం ద్వారా నిర్మాతగా మారిన ఆయన ఆ తర్వాత ఎన్టీఆర్‌, ఏయన్నార్‌, కృష్ణ, కృష్ణంరాజు, చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్‌, పవన్‌కళ్యాణ్‌, మహేష్‌బాబు, జూనియర్‌ ఎన్టీఆర్‌, అల్లుఅర్జున్‌, రామ్‌చరణ్‌ ... ఇలా ఎన్నో తరాల హీరోలతో చిత్రాలను నిర్మించాడు. ముఖ్యంగా ఇండస్ట్రీలో ఎవరైన వారసుడిని పరిచయం చేయాలంటే అది అశ్వనీదత్‌, రాఘవేంద్రరావుల కాంబినేషన్‌ అయితేనే బాగుంటుందని, అలా పరిచయం అయిన వారందరు టాప్‌ స్టార్స్‌గా ఉన్నారని దానిని ఓ సెంటిమెంట్‌గా భావిస్తుంటారు. ఇక నిర్మాణం, నాణ్యతల విషయంలో ఈయన బడ్జెట్‌కి ఏమాత్రం వెనకడగు వేయడు. అందుకే స్వయనా నాటి స్వర్గీయ ఎన్టీఆర్‌ 'వైజయంతి' బేనర్‌ని కూడా తన చేతుల మీదుగానే ఆవిష్కరించాడు. ఎన్టీఆర్‌తో ఎన్నో చిత్రాలు నిర్మించిన ఆయన మెగాస్టార్‌ చిరంజీవితో 'జగదేకవీరుడు-అతిలోకసుందరి, చూడాలని ఉంది, ఇంద్ర, జైచిరంజీవ'వంటి చిత్రాలు తీశాడు. 

ఇక 'జైచిరంజీవ'తో పాటు 'శక్తి, సైనికుడు, కంత్రి, సుభాష్‌ చంద్రబోస్‌' వంటి చిత్రాలతో భారీ పరాజయాలు పొంది మరలా ఇటీవలే తన కుమార్తెల సాయంతో 'మహానటి' చిత్రం తీశాడు. ఇక 'దేవదాస్‌' కూడా అనుకున్న విజయం సాధించలేకపోయింది. ప్రస్తుతం ఆయన దిల్‌రాజుతో కలిసి భాగస్వామ్యంగా మహేష్‌బాబు ప్రతిష్టాత్మకమైన 25వ చిత్రంగా 'మహర్షి' చిత్రం నిర్మిస్తున్నాడు. ఈ చిత్రంతోనైనా మరలా ఫామ్‌లోకి రావాలని ఆశపడుతున్నాడు. ఇక విషయానికి వస్తే అశ్వనీదత్‌ అల్లుడు, 'మహానటి' దర్శకుడు నాగ్‌అశ్విన్‌ దర్శకత్వంలో మెగాస్టార్‌ చిరంజీవి హీరోగా వైజయంతి మూవీస్‌ బేనర్‌లో ఓ చిత్రం రూపొందనుందని, ఆల్‌రెడీ కథాచర్చలు జరిగాయని వార్తలు గుప్పుమన్నాయి. 

తాజాగా అశ్వనీదత్‌ మాట్లాడుతూ, నాగ్‌ అశ్విన్‌ ఓ కథను తయారు చేస్తున్నాడు. ఆ స్క్రిప్ట్‌ పూర్తయిన తర్వాత అది చిరంజీవి గారికి సూటబుల్‌ అవుతుందని భావిస్తే అప్పుడు ఆ ప్రాజెక్ట్‌ గురించి ఆలోచిస్తాను. ప్రస్తుతానికి ఇదంతా ప్రచారమే గానీ ఇందులో నిజం లేదు. మేము ఇప్పటి వరకు చిరంజీవి గారితో నాలుగు బ్లాక్‌బస్టర్స్‌ చేశాం. ఐదవ చిత్రం చేసే అవకాశం వస్తే సంతోషిస్తాం. అదే నిజమైతే ఆ విషయాన్ని మేమే సగర్వంగా అందరికీ తెలియజేస్తామని చెప్పుకొచ్చాడు. 

Sponsored links

Ashwini Dutt Clarity on Chiranjeevi 152 Film :

Chiranjeevi 152 Film not in Vyjayanthi Banner

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019