‘పేపర్‌బాయ్‌’ విషయంలో స్పందించిన అల్లు!

సంపత్‌నంది దర్శకునిగా ‘రచ్చ, బెంగాల్‌టైగర్‌’ చిత్రాల ద్వారా తన సత్తా చాటుకున్నాడు. ఇక ఈయన నిర్మాతగా మారి ‘గాలిపటం’ అనే ఓ చిన్న చిత్రాన్ని నిర్మించాడు. కథలో వైవిధ్యం ఉన్నా సరైన ప్రమోషన్స్‌ లేకపోవడం వల్ల ఈ చిత్రం సరిగా ఆడలేదు. ప్రస్తుతం సంపత్‌ నంది నిర్మాతగా తన రెండో చిత్రాన్ని జయశంకర్‌ దర్శకత్వంలో స్వర్గీయ దర్శకుడు, ‘వర్షం, బాబి’ చిత్రాల ఫేమ్‌ శోభన్‌ కుమారుడు సంతోష్‌శోభన్‌ హీరోగా రియా సుమన్‌, తాన్యాహోప్‌లు హీరోయిన్లుగా ‘పేపర్‌బాయ్‌’ చిత్రం నిర్మిస్తున్నాడు. 

ఈ చిత్రం హోల్‌సేల్‌ పంపిణీ హక్కులను నిర్మాత అల్లుఅరవింద్‌ తీసుకున్నాడు. దీనిపై ఆయన మాట్లాడుతూ.. నేను ఈ సినిమా హక్కులను తీసుకోవడానికి కారణం బన్నీ. ఒకరోజున బన్నీ ఈ చిత్రం ట్రైలర్‌ వీడియోను నాకు పంపాడు. ట్రైలర్‌ నాకు బాగా నచ్చింది. యూత్‌కి కనెక్ట్‌ అవుతుందని అనిపించింది. అదే సమయంలో సంపత్‌నంది వచ్చిఈ చిత్రం ట్రైలర్‌ని ఓసారి చూడమని చెప్పాడు. ట్రైలర్‌ నచ్చడం వల్లే సినిమా చూశాను. చూశాక ఈ చిత్రాన్ని మంచి పబ్లిసిటీతో విడుదల చేయాలని అనిపించింది. అందువల్ల ఈ చిత్రం రైట్స్‌ని కొనడం జరిగిందని చెప్పుకొచ్చాడు.

Allu Aravind Released Paper Boy Movie

Allu Aravind About Paper Boy Rights
allu aravind
paper boy
release
sampath nandi
Advertisement
Advertisement