విజయ్‌కి హీరోయిన్ సెట్టయినట్లే..!

Raashi Khanna in Vijay Devarakonda and Kranthi Madhav Film

Thu 16th Aug 2018 11:32 AM
vijay devarakonda,raashi khanna,kranthi madhav,heroine  విజయ్‌కి హీరోయిన్ సెట్టయినట్లే..!
Raashi Khanna in Vijay Devarakonda and Kranthi Madhav Film విజయ్‌కి హీరోయిన్ సెట్టయినట్లే..!
Advertisement

‘అర్జున్‌రెడ్డి’ సినిమాతో అమాంతం తన ఇమేజ్ పెంచుకున్న విజయ్‌ను రీసెంట్‌గా అల్లు అరవింద్ ఇతను ఖచ్చితంగా వంద సినిమాలు చేయటం ఖాయం అని కితాబిచ్చాడు. మరి అతని టాలెంట్ అటువంటిది. ఇక ఇతను నటించిన ‘గీత గోవిందం’ చిత్రం రిలీజ్‌ అయ్యి పాజిటిల్ టాక్‌ తెచ్చుకుంది. భారీ అంచనాల మధ్య రిలీజ్ అయిన ఈ సినిమా అడ్వాన్స్ బుకింగ్ ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో అయిపోయాయి. పెద్ద హీరోస్ సినిమాలకి బుకింగ్ అయ్యినట్టు ఇతని సినిమాకి అయ్యాయి అంటే మనోడు రేంజ్ ఏంటో అర్ధం ఇట్టే అర్ధమవుతోంది.

మరి ఇటువంటి క్రేజీ హీరో పక్క ఏ హీరోయిన్‌కు చేయాలనుండదు చెప్పండి. ఒకవేళ ఈ హీరో పక్కన ఛాన్స్ వస్తే ఎగిరి గంతేసి ఒప్పుకోవాలి కదా. అయితే అలాంటి పరిస్థితి రాశి ఖన్నాకి వచ్చిందంట. క్రాంతి మాధవ్ డైరెక్షన్‌లో విజయ్ చేయబోయే సినిమాలో హీరోయిన్‌గా రాశి ఖన్నా అయితే బాగుంటది అని అనుకుంటున్నారట. ఈ సినిమాను క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ పై కె.ఎస్. రామారావు నిర్మిస్తున్నారు.

ప్రస్తుతం చేస్తున్న ‘నోటా, డియర్ కామ్రేడ్’ సినిమాల తర్వాత విజయ్.. క్రాంతి మాధవ్‌తో చేయనున్నాడు. అక్టోబర్ నుండి ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. ఇది ఒక ఫీల్ గుడ్ లవ్ స్టోరీ అని తెలుస్తుంది. రియల్ లైఫ్‌లో జరిగిన కొన్ని సంఘటనల ఆధారంగా క్రాంతి మాధవ్ ఈ సినిమా కథ తయారు చేసుకున్నాడని సమాచారం. ‘గీత గోవిందం’ తర్వాత ‘టాక్సీవాలా’ రిలీజ్‌కు రెడీగా ఉంది.

Raashi Khanna in Vijay Devarakonda and Kranthi Madhav Film:

Vijay Devarakonda and KS RamaRao Movie Heroine Fixed


Loading..
Loading..
Loading..
advertisement