కిరాక్‌ భామ కాబోయే వాడికి షాకిచ్చింది!

Sat 04th Aug 2018 12:48 PM
rashmika mandanna,engagement,rakshit shetty,break  కిరాక్‌ భామ కాబోయే వాడికి షాకిచ్చింది!
Rashmika Mandanna Might Break Engagement with Rakshit Shetty కిరాక్‌ భామ కాబోయే వాడికి షాకిచ్చింది!
Sponsored links

నేటితరం హీరోయిన్లు వృత్తికి ఎంత ప్రాధాన్యం ఇస్తున్నారో, వ్యక్తిగత జీవితానికి కూడా అంతే విలువ ఇస్తున్నారు. ఏ వయసులో జరగాల్సిన ముచ్చట అప్పుడు జరగాలనేది వారి కోరిక. ఇక 'కిరాక్‌పార్టీ'తో దేశవ్యాప్తంగా అందరిని తన వైపుకు తిప్పుకుని, తెలుగులో 'ఛలో' చిత్రంలో నాగశౌర్య సరసన నటించిన కన్నడభామ 'కిర్రాక్‌ పార్టీ' షూటింగ్‌ సమయంలోనే నటుడు, దర్శకుడు రక్షిత్‌ శెట్టితో ఎంగేజ్‌మెంట్‌ చేసుకుంది. అయితే ఇప్పుడు ఆమె క్రేజ్‌ని చూసి వరుసగా దక్షిణాది చిత్రాలన్నింటిలో మంచి మంచి అవకాశాలు వస్తున్నాయి. 

దాంతోఆమె ఆ నిశ్చితార్ధాన్ని వాయిదా వేసుకుందని సమాచారం. ఆమధ్య ఆమె మట్లాడుతూ, అనుష్కలాగా పేరు తెచ్చుకోవాలని ఉందని చెప్పుకొచ్చింది. ఒకటి రెండు చిత్రాలకే వివాహం చేసుకుంటే అనుష్క వంటి పేరు, ఆఫర్లు ఆమెకి రావనే చెప్పాలి. దాంతో ఆమె మంచి నిర్ణయమే తీసుకుందని అంటున్నారు. మరోవైపు 'గీతగోవిందం'లో విజయ్‌దేవరకొండతో మేడ్‌ ఫర్‌ ఈచ్‌ అదర్‌ అన్నట్లుగా, వారి రొమాన్స్‌పై రక్షిత్‌ అలిగాడని అంటున్నారు. కానీ ఆమె సన్నిహితులు మాత్రం అదేమీ లేదని, ఆమె రక్షిత్‌ని వివాహం చేసుకోనుందని చెబుతున్నారు. 

Sponsored links

Rashmika Mandanna Might Break Engagement with Rakshit Shetty:

Rashmika, Is She Going To Cancel Her Engagement ?

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019