Advertisement

సామ్, చైతూ సినిమాకి క్లాప్ కొట్టారు..!

Mon 23rd Jul 2018 07:14 PM
naga chaitanya,samantha,nagarjuna,movie opening,shine screens  సామ్, చైతూ సినిమాకి క్లాప్ కొట్టారు..!
Naga Chaitanya, Samantha combo Movie Started సామ్, చైతూ సినిమాకి క్లాప్ కొట్టారు..!
Advertisement

నాగచైతన్య-సమంత జంటగా షైన్ స్క్రీన్స్ ప్రొడక్షన్ నెం.2 ప్రారంభం !!

మోస్ట్ ఏవైటెడ్ కాంబినేషన్ నాగచైతన్య-సమంత జంటగా నూతన చిత్ర ప్రారంభోత్సవం ఇవాళ జరిగింది. షైన్ స్క్రీన్స్ పతాకంపై సాహు గారపాటి-హరీష్ పెద్ది సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి 'నిన్నుకోరి'తో ప్రేక్షకులను విశేషంగా అలరించిన శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్నాడు. 

హైదరాబాద్ లోని అన్నపూర్ణ స్టూడియోస్ లో ఈ చిత్ర ప్రారంభోత్సవం లాంఛనంగా జరిగింది. నాగార్జున ముఖ్య అతిధిగా విచ్చేసి బౌండెడ్ స్క్రిప్ట్ ను దర్శకుడు శివ నిర్వాణకు అందించారు. నాగచైతన్య-సమంత వివాహం అనంతరం నటిస్తున్న చిత్రమిదే కావడం విశేషం. 

దివ్యాన్ష కౌశిక్ రెండో హీరోయిన్ గా నటిస్తుండగా.. శ్రీనివాస్ అవసరాల, రావురమేష్, పోసాని కృష్ణమురళి ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ చిత్రం రెగ్యులర్ షూటింగ్ ఆగస్ట్ రెండోవారం నుంచి మొదలవుతుంది. 

గోపీసుందర్ సంగీత సారధ్యం వహించనున్న ఈ చిత్ర ప్రారంభోత్సవ వేడుకలో మైత్రీ మూవీ మేకర్స్ అధినేత నిర్మాత నవీన్ యెర్నేని, రచయిత కోన వెంకట్ పాల్గొన్నారు. 

తారాగణం: నాగచైతన్య, సమంత, దివ్యాన్ష కౌశిక్, రావురమేష్, శ్రీనివాస్ అవసరాల, పోసాని కృష్ణమురళి, శత్రు, రాజశ్రీ నాయర్ తదితరులు.. 

సాంకేతికవర్గం: రచన-దర్శకత్వం: శివ నిర్వాణ,  నిర్మాతలు: సాహు గారపాటి-హరీష్ పెద్ది, నిర్మాణ సంస్థ: షైన్ స్క్రీన్స్, సంగీతం: గోపీ సుందర్,  ఛాయాగ్రహణం: విష్ణు శర్మ, ప్రోడ్కషన్ డిజైనర్: సాహి సురేష్, కూర్పు: ప్రవీణ్ పూడి,  కో-డైరెక్టర్: లక్ష్మణ్ మూసులూరి,  లైన్ ప్రొడ్యూసర్: నాగమోహన్,  పి.ఆర్.ఓ: వంశీ-శేఖర్

Naga Chaitanya, Samantha combo Movie Started :

Naga Chaitanya, Samantha and Shine Screens Production No 2 Launched

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement