ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Sreeraj-Vibha are not husband and wife, but Partners in Crime, says Poonam Kaur

పూనమ్‌ కౌర్.. మరో బాంబు పేల్చింది!

శ్రీరెడ్డి కాస్టింగ్‌కౌచ్‌ నుంచి బయటపడకముందే టాలీవుడ్‌ని అమెరికాలోని చికాగోలో జరిగిన సెక్స్‌రాకెట్‌ తీవ్ర ఇబ్బందులకు, విమర్శలకు గురిచేస్తుంది. ఈ రాకెట్‌పై ఇప్పటికే పూనమ్‌కౌర్‌ నుంచి మాధవీలత, శ్రీరెడ్డి, అపూర్వ వంటి పలువురు స్పందించారు. ఇక శ్రీరెడ్డి మాట్లాడుతూ, అసలు చికాగో సెక్స్‌రాకెట్‌ని బయటపెట్టించింది తానేనని, టాలీవుడ్‌ పెద్దల పెద్దరికం తెలియజేసేందుకే తాను ఈ సెక్స్‌రాకెట్‌ని బహిర్గతం చేశానని చెప్పడం మరింతగా సంచలనం సృష్టిస్తోంది. 

ఇదే సమయంలో పూనమ్‌కౌర్‌ ఈ విషయంలోని మరో సంచలన విషయాన్ని బహిర్గతం చేసింది. ఇప్పటికే చికాగో సెక్స్‌రాకెట్‌లో కిషన్‌ మోదుగుమూడి-చంద్ర దంపతులను అమెరికా పోలీసులు కటకటాల వెనక్కి నెట్టి, ఈ కేసుపై ఎంతో సునిశితంగా దర్యాప్తు చేస్తున్నారు. పలువురు అమెరికాకి వచ్చిపోయే నటీమణులను ప్రశ్నిస్తున్నారు. ఇక పూనమ్‌ ఈ విషయంపై స్పందిస్తూ అసలు పోలీసులు అరెస్ట్‌ చేసిన సెక్స్‌రాకెట్‌ సూత్రధారులు నిజమైన భార్యాభర్తలు కాదని తేల్చిచెప్పింది. లగ్జరీ లైఫ్‌ని అనుభవించడం కోసం, డబ్బు కోసం వారు ఇలా చేస్తున్నారు. వారిద్దరు భార్యాభర్తలుగా నటిస్తున్నారు. కానీ వారు భార్యాభర్తలు కాదు. 

ఓ సారి ఈవెంట్‌కోసం నేను అమెరికా వెళ్లాను. నేను బస చేసిన హోటల్‌ వద్దకు కిషన్‌-చంద్రలకు సంబంధించిన ఓ వ్యక్తి అర్ధరాత్రి వచ్చి తలుపు తట్టి ఏవేవో మాట్లాడాడు. ఈయన నాకు తెలుగు రాదనుకుని ఏవేవో మాట్లాడటంతో నాకు విషయం అర్ధమైంది. దాంతో ఆయన చెంపను పగులగొట్టాను. అమెరికాలో డబ్బు ఆశ చూపో, బలవంతం చేసో నటీమణుల చేత ఈ పని చేయిస్తున్నారు. అలా మన దేశ అమ్మాయిలను లొంగతీసుకుని ఇలాంటి కార్యకలాపాలకు వారిని వాడుకోవడంపై ప్రధాని మోదీ దృష్టి పెట్టాలి.. అంటూ చెప్పుకొచ్చింది. 

Poonam Kaur talks about Tollywood Sex Racket at Chacago

Sreeraj-Vibha are not husband and wife, but Partners in Crime, says Poonam Kaur
poonam kaur
tollywood sex racket
chacago
kishan modugumudi
vibha