ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Rakul Preet on Twitter wishes To Kiara Advani

కైరా అద్వానీకి రకుల్‌ ప్రీత్ ప్రశంస..!

వాస్తవానికి నిన్నమొన్నటి దాకా టాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అంటే రకుల్‌ప్రీత్‌సింగ్‌ పేరును చెప్పుకునేవారు. కానీ 'డిజె' పుణ్యామా అని పూజాహెగ్డే, 'భరత్‌ అనేనేను' చిత్రం ద్వారా కైరా అద్వానీలు ఆ స్థానంకోసం పోటీపడుతుండగా రకుల్‌ప్రీత్‌సింగ్‌ రేసులో వెనక్కి వెళ్లిపోయింది. 'స్పైడర్‌, జయజానకి నాయకా' చిత్రాలు ఆమెకి ఏ విధంగానూ ప్లస్‌ కాలేదు. ఇక ప్రస్తుతం ఈమె బాలీవుడ్‌లో కూడా తన అదృష్టం పరీక్షించుకుంటోంది. 

ఇక తాజాగా ఈనెల 15వ తేదీన కైరా అద్వానీ ప్రధాన పాత్రను పోషించిన 'లవ్‌స్టోరీస్‌' చిత్రం విడుదలైంది. కరణ్‌జోహార్‌, అనురాగ్‌ కస్యప్‌, దివాకర్‌ బెనర్జీ, జోయా అక్తర్‌లు ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. రోనీ స్క్రూవాలా ఈ చిత్రాన్ని నిర్మించాడు. ఇందులో కైరా అద్వానీతో పాటు రాధికా ఆప్టే, భూమి పెడ్నేకర్‌, మనీషా కోయిరాల, నేహాధూపియా ప్రధాన పాత్రలు పోషించారు. విభిన్నకథాంశంతో రూపొందిన ఈ చిత్రం జూన్‌15న విడుదలై హిట్‌ టాక్‌ని సొంతం చేసుకుంది. పాశ్చాత్య సంప్రదాయాలపై మహిళల అభిప్రాయం ఏంటి? అనే కోణంలో ఈ చిత్రం ఉంది. ఈ సినిమాని చూసిన రకుల్‌ప్రీత్‌సింగ్‌ ట్విట్టర్‌ వేదికగా ఈ చిత్రం యూనిట్‌పై ప్రశంసల వర్షం కురిపించింది. 

ఈ కథల ప్రపంచంలో మెరుగైన ఆలోచన, ముందు చూపుతో తెరకెక్కిన చిత్రం 'లవ్‌స్టోరీస్‌'. మనుషుల ఆశలు, ఆంక్షలను బలంగా చూపించారు. సినిమాలోని ప్రతి నటీనటులు తమ పాత్రల్లో జీవించారు అని ఆమె ప్రశంసల వర్షం కురిపించింది. కైరా, కరణ్‌లకు ఆమె ప్రత్యేక శుభాకాంక్షలు తెలియజేసింది. ఆమెకి 'కైరా' ధన్యవాదాలు తెలిపింది. ఇక ఇటీవలే మహేష్‌బాబు సరసన 'భరత్‌ అనే నేను'లో నటించిన కైరా ప్రస్తుతం రామ్ చరణ్‌, బోయపాటి శ్రీను, దానయ్యల కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రంలో కూడా హీరోయిన్‌గా నటిస్తోంది. 

Rakul Preet Special Wish to Kiara Advani

Rakul Preet on Twitter wishes To Kiara Advani
rakul preet singh
kiara advani
wish
social media