ఆ ఎన్టీఆర్ కి ఈ ఎన్టీఆర్ ఇచ్చిన నివాళి!

'మీ పాదం మోపక ధరిత్రి చిన్నబోతోంది....మీ రూపు కానక తెలుగు గుండె తల్లడిల్లిపోతోంది....పెద్దమనసుతో ఈ ధరిత్రిని, ఈగుండెను మరోసారి తాకిపోతాతా...సదా మీ ప్రేమకు బానిసను' అంటూ సీనియర్ ఎన్టీఆర్ జయంతి సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన ప్రకటన మరోసారి ఆకట్టుకుంది. ఈ విధంగా తన తాతయ్యను తలుచుకుంటూ జూనియర్ ఎన్టీఆర్ ఇచ్చిన భావోద్వేగమైన పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది.
దానిని చూసిన అభిమానుల్లో ఆనందభాష్పాలు రాలుతున్నాయి. ఎన్టీఆర్ జయంతిని ఘనంగా తెలుగువారందరు జరుపుకుంటున్న వేళ నందమూరి అభిమానులు ఆ పనులలో బిజీగా ఉన్న సమయంలో ఆయన రూపాన్ని పుణికిపుచ్చుకున్న ప్రియ మనవడిగా, తెలుగు సినీ వినీలాకాశంలో స్టార్‌గా ఉన్న ఎన్టీఆర్ తన తాతపై తనకు ఎంత అభిమానం ఉందో ఈ పోస్టర్‌ని బట్టి అర్ధమవుతోంది.
ఇక ఇదే సమయంలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్‌కి సంబంధించిన చిత్రానికి తేజ స్థానంలో తన 100వ ప్రతిష్టాత్మకమైన 'గౌతమీపుత్ర శాతకర్ణి'కి దర్శకత్వం వహించిన క్రిష్‌కే ఆ బాద్యతలను అప్పగించడం విశేషం. ఎన్టీఆర్ బయోపిక్‌ని లేటుగా కాకుండా వచ్చే సంక్రాంతి నాటికే విడుదల చేయాలని బాలకృష్ణ తీర్మానించాడని తెలుస్తోంది.
Jr NTR visits NTR Ghat on NTR Birth Anniversary
Jr. NTR Pay Tributes To Senior NTR On His Birth Anniversary






































