తాప్సి ఇచ్చిన కౌంటర్‌ అదిరింది!

'ఝుమ్మంది నాదం' ద్వారా మొదటి చిత్రమే దర్శకేంద్రుడు రాఘవేంద్రరావు దర్శకత్వంతో పరిశ్రమకు పరిచయమైంది తాప్సి. ఈ సొట్టబుగ్గల సుందరి చిత్రాలు సరిగా ఆడలేదు. అయినా ఆమె నటనకు, అందానికి మాత్రం ఎప్పుడు మైనస్‌ పాయింట్స్‌ పడలేదు. కేవలం ఆమె నటించిన చిత్రాలు ఫ్లాప్‌ కావడం, ఇతర స్టార్‌హీరోయిన్ల పక్కన సెకండ్‌ హీరోయిన్‌ వేషాలతో సరిపెట్టింది. ఇక ఈమె బాలీవుడ్‌కి వెళ్లి అమితాబ్‌కి దీటుగా నటించడమే కాదు... ఇటీవల 'జుడ్వా2' ద్వారా బికినీలో కనిపించి తనలో నటనే కాదు.. గ్లామర్‌ యాంగిల్‌ కూడా ఉందని ప్రూవ్‌ చేసింది. దీంతో ఆమెకి బాలీవుడ్‌లో మాత్రం మంచి అవకాశాలే లభిస్తున్నాయి. ఈమె అందం బాలీవుడ్‌ ప్రేక్షకులను బాగా మెప్పిస్తోంది. 

ఇక ఈమె తాజాగా అనురాగ్‌ కశ్యప్‌తో 'మన్మర్జియా' చిత్రంలో నటిస్తోంది. అనురాగ్‌కశ్యప్‌ దర్శకత్వం వహిస్తుండటంతో ఈ చిత్రంపై మంచి పాజిటివ్‌ టాకే ఉంది. కాగా తాజాగా ఈ అమ్మడు స్నాక్స్‌ తింటూ, పక్కన దర్శకుడు అనురాగ్‌కశ్యప్‌తో ఉన్న ఫొటోని సోషల్‌మీడియాలో పోస్ట్‌ చేసింది. ఇందులో ఆమె అందంగానే ఉంది. కానీ ఓ నెటిజన్‌కి మాత్రం ఆమె ఎందుకో నచ్చలేదు. దాంతో అతను నీకు మొదటి చాన్స్‌ ఇచ్చింది ఎవరు? బొత్తిగా నీలో అందం లేదు. నువ్వు జస్ట్‌ యావరేజ్‌గా మాత్రమే ఉన్నావని కామెంట్‌ చేశాడు. దానికి తాప్సి భలే కరుకుగా సమాధానం ఇచ్చింది. ఏమో నేను యావరేజ్‌ అయిఉండవచ్చు.బహుశా నాలోని టాలెంట్‌ని చూసి అవకాశం ఇచ్చిఉంటారు. అయినా యావరేజ్‌ అనేది ఏమీ చిన్నవిషయం కాదు. అదో పెద్ద కేటగరీ... అంటూ సమాధానం చెప్పడంతో ఆ నెటిజన్‌ వ్యాఖ్యలకు బాగా కౌంటర్‌ ఇచ్చిందనే ప్రశంసలు తాప్సిపన్నుకి లభిస్తున్నాయి. 

Taapsee class to Netizen

Tapsee Superb Counter on Netizen
taapsee
netizen
tweet
heroine taapse