విడుదలైన రోజు సుకుమార్ నిద్రపోలేదంట!

నేడు ఎంత పెద్ద స్టార్‌ చిత్రమైనా, ఎంత పెద్ద సినిమా అయినా మొదటి వీక్‌ .. ఇంకా చెప్పాలంటే మొదటి వీకెండ్‌ మూడు నాలుగురోజుల కలెక్షన్ల మీదనే ఆధారపడుతున్నారు. ఆ తర్వాత థియేటర్లలో జనాలుఉండటం లేదు. కానీ 'రంగస్థలం' మాత్రం దీనిని తప్పు అని తేల్చివేసింది. మొదటి వీకెండ్‌ మాత్రమే కాదు.. మొదటి వీక్‌, రెండో వీక్‌లో కూడా స్ట్రాంగ్‌గా దూసుకెళుతూ, కలెక్షన్లలో సరికొత్త రికార్డులను క్రియేట్‌చేస్తోంది. ఇక ఈ చిత్రం ఎంత వరకు కలెక్షన్లుసాధించి, లాంగ్‌రన్‌తర్వాత ఏ మార్కుని చేరుకుంటుందో వేచిచూడాల్సివుంది. ఇక సాధారణంగా ఇలాంటి 'రా' చిత్రాలు తమిళం, మలయాళంలో మాత్రమే వస్తూ ఉంటాయి. కానీ తెలుగు ప్రేక్షకులు కూడా సినిమా కథకి కమర్షియల్‌ అంశాలు జోడించి, తీయాల్సిన విధంగా తీస్తే బాక్సాఫీస్‌లను తిరగరాయడం గ్యారంటీ అని తేల్చారు. ఈ సినిమా చూసిన పెద్ద పెద్ద స్టార్స్‌ కూడా తమకు ఇలాంటి కథ కెరీర్‌లో లభించలేదని, పవన్‌ నుంచి ఎన్టీఆర్‌, మహేష్‌ వరకు అందరు ముక్తకంఠంతో చెబుతున్నారు. 

ఇక సుకుమార్‌కి కూడా ఈ చిత్రం నిద్రలేకుండా చేసిందట. తన గత చిత్రాల విషయంలో టెన్షన్‌ పడలేదని, హాయిగా రాత్రి నిద్రపోయి ఉదయాన్నే రిజల్ట్‌ తెలుసుకునే వాడిని. కానీ 'రంగస్థలం' విషయంలో మాత్రం సుకుమార్‌ ఎంతో టెన్షన్‌ పడ్డాడట. చిరంజీవితో పాటు ఇతర స్నేహితులు కూడా చూసి సూపర్‌గా ఉందని చెప్పినా సుకుమార్‌లో టెన్షన్‌ తగ్గలేదట. ఇక రాత్రంతా నిద్రపోలేదు. మొదట యూఎస్‌ టాక్‌ వచ్చింది. చాలా బాగుందని టాక్‌ చెప్పారు. అయినా నా టెన్షన్‌ తగ్గలేదు. ఎందుకంటే పలు చిత్రాలు యూఎస్‌లో భారీ విజయాన్ని సాధించినా, రెండు తెలుగు రాష్ట్రాలలో, ఇక్కడ మాత్రం ఫెయిలయ్యాయి. దాంతో రాత్రంగా నిద్ర లేకుండా గడిపాను. మన చోట ఫస్ట్‌షో పడి సక్సెస్‌ టాక్‌ వచ్చిన తర్వాత మాత్రమే హాయిగా నిద్రపోయి లేచాను. ఈ చిత్రం విడుదల రోజు రాత్రంగా నాకు నిద్రలేదు అని సుకుమార్‌ చెప్పుకొచ్చాడు. 

Director Sukumar Tension on Rangasthalam Release day

Sukumar About Rangasthalam
sukumar
rangasthalam
release day
sukku
tension