ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> One More Million Doller Movie to Samantha

మిలియన్‌ డాలర్ల హీరోయిన్‌.. సమంత!

One More Million Doller Movie to SamanthaOne More Million Doller Movie to Samantha

సమంత... నిన్నటి వరకు అక్కినేని కోడలు కాకముందు పలువురు స్టార్‌ హీరోల సరసన నటించింది. ఈ చిత్రాలలో అత్యధిక భాగం ఆమెకి మంచి పేరునే కాకుండా ఓవర్‌సీస్‌లో మిలియన్‌ డాలర్ల క్లబ్‌లో చేరాయి. ఇక విజయ్‌తో కలిసి నటించిన కోలీవుడ్‌ చిత్రాలైన 'తేరి, మెర్సల్, 24' చిత్రాలు కూడా విదేశాలలో మిలియన్‌ మార్కును అంటే 10లక్షల డాలర్లను వసూలు చేయడం విశేషం. ఇప్పుడు తాజాగా ఆమె సుకుమార్‌ దర్శకత్వంలో రామ్‌చరణ్‌, సమంతలు కలిసి నటించిన 'రంగస్థలం' చిత్రం కూడా మొదటి రోజే మిలియన్‌ మార్కుని అందుకోవడంతో ఇప్పుడు అందరు సమంతను మిలియన్‌ డాలర్ల హీరోయిన్‌గా పిలుస్తున్నారు. అలా పిలవడం సమంజసం కూడా. ఇక ఈమె 'రంగస్థలం'లో రామలక్ష్మిగా చూపించిన నటనా ప్రతిభ అద్భుతంగా ఉంది. అచ్చుపల్లెటూరు అమ్మాయిలా, డీగ్లామరైజ్‌ పాత్రలో ఈమె నటనకు ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు. ఇక మీదట కూడా ఈమె తన పాత్రలను బాగా ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటూ ఉండటంతో భవిష్యత్తులో కూడా ఈమె మిలియన్‌ డాలర్ల బేబీగా నిలవడం ఖాయమంటున్నారు. ప్రస్తుతం సమంత తెలుగులో సావిత్రి బయోపిక్‌గా రూపొందుతున్న 'మహానటి'లో ఓ పాత్ర చేసింది. దీనికి కోలీవుడ్‌లో 'నడిగైయార్‌ తిలగం' అనే టైటిల్‌ ఖరారు చేశారు. ఈ చిత్రం తెలుగుతో పాటు తమిళం, మలయాళంలో కూడా రూపొందుతుండటం, సావిత్రి అంటే తెలుగు ప్రేక్షకులందరికీ దేవత కాబట్టి ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు మరోసారి మిలియన్‌ డాలర్ల ఖాతాలో చేరుస్తారని యూనిట్‌ నమ్మకంగా ఉంది. 

ఇక విశాల్‌తో ఈమె నటించిన 'ఇరుంబుతిరై' తెలుగులో 'అభిమన్యుడు'గా రానుంది. శివకార్తికేయన్‌ హీరోగా రూపొందుతున్న 'సీమరాజా', లేడీ ఓరియంటెడ్‌ చిత్రంగానే కాకుండా తానే నిర్మాతగా కన్నడ బ్లాక్‌బస్టర్‌ 'యూటర్న్‌' వంటి చిత్రాలలో సమంత నటిస్తోంది. దీంతో ఈ చిత్రాలు కూడా మిలియన్‌ డాలర్ల ఖాతాలో చేరుతాయో లేదో చూడాలి. మొత్తానికి ప్రస్తుతానికి మాత్రం అందరు ఈమెని మిలియన్‌ డాలర్ల బ్యూటీ అంటున్నారు. ఇక ఈ చిత్రంలో రామలక్ష్మికి చిట్టిబాబు ఎంత ఇష్టమో, చిట్టిబాబుకి రామలక్ష్మి మీద ఎంత ప్రేమో తెలియజేసేందుకు వారి మధ్య సుకుమార్‌ నడిపిన రొమాన్స్‌ ట్రాక్‌ కూడా అద్భుతంగా కుదిరింది. ఇప్పుడు అందరు రామ్‌చరణ్‌, సమంతల నటననే కాదు.. సుకుమార్‌ టేకింగ్‌ని కూడా మెచ్చుకుంటున్నారు. ఇక ఇందులో రామలక్ష్మి, చిట్టిబాబుల మధ్య ఓ ప్రపోజింగ్‌ సీన్‌ని దర్శకుడు పెట్టాడు. ఇది ఈచిత్రంలోని హైలైట్‌ సీన్లలో ఒకటని చెప్పాలి. ఇక ఈ సీన్‌లో సమంత రామ్‌చరణ్‌ బుగ్గ మీద ముద్దు పెడుతుంది. తర్వాత చిట్టిబాబు కూడా ఆమెకి ముద్దిస్తాడు. ఈ సీన్‌లో రామ్‌చరణ్‌ కాస్త సిగ్గుపడి, బిడియంగా నటించినట్లు కనిపించాడు గానీ సమంత మాత్రం ఎంతో ప్రొఫెషనల్‌గా ఈ సీన్‌ని ఓకే చేసింది. దీంతో అందరు ఆమె ప్రొఫెషనిజం గురించి మాట్లాడుకుంటుంటే, మరికొందరు మాత్రం అక్కినేని కోడలు ఇలా ముద్దు సీన్‌లో నటించడం ఏమిటని అంటున్నారు. అయినా సినిమా సినిమానే... జీవితం జీవితమే అని చెప్పాలి. 

Samantha as Million Doller Girl

samantha
million doller
rangasthalam
mahanati