Advertisement

అజ్ఞాతవాసి.. 10 కోట్ల డీల్ నిజమేనా?

Sat 06th Jan 2018 01:38 PM
pawan kalyan,agnyaathavaasi,copy issue,10 crores  అజ్ఞాతవాసి.. 10 కోట్ల డీల్ నిజమేనా?
Agnyaathavaasi copy issue Ends with 10 crores అజ్ఞాతవాసి.. 10 కోట్ల డీల్ నిజమేనా?
Advertisement

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్ మూవీ అజ్ఞాతవాసి రిలీజ్ కు రెడీ అయింది. మరో కొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కాబోతోంది. విడుదల దగ్గర పడటంతో పాటు ఈ సినిమా చుట్టూ కొత్త వివాదాలు చుట్టుముడుతున్నాయి. వాటిల్లో ఒకటి.. ఈ సినిమా ఫ్రెంచ్ మూవీ లార్గో వించ్ ని కాపీ కొట్టి తీశారనేది.

అజ్ఞాతవాసి టీజర్ చూసి ఇది ఆ సినిమా పోలికలు బట్టి చాలా ఇంటెలిజెంట్ కాపీ కొట్టారని కొందరు విమర్శలు చేస్తున్నారు. వాస్తవానికి లార్గో వించ్  సినిమా రీమేక్ రైట్స్ బాలీవుడ్ కు చెందిన ప్రముఖ నిర్మాణ సంస్థ  టీసిరీస్ దక్కించుకుంది. అయితే అజ్ఞాతవాసి రిలీజ్ అవుతున్న సందర్భంగా ఆ సంస్థ లీగల్ గా అడుగు ముందుకేస్తోందని టాలీవుడ్ లో ఎప్పటినుండో టాక్ వినిపిస్తోంది.

టీ - సిరీస్ కు రానా కాస్త పరిచయాలు ఉండటంతో ఈ ఇష్యూ బయటికి రాకుండా రానా ద్వారా పరిష్కరించుకోవాలని రాధాకృష్ణ  తెరవెనుక ప్రయత్నాలు చేస్తున్నాడని టాక్ కూడా ఉంది. అయితే ఆ సినిమా రీమేక్ రైట్స్ కి గాను ఆ సంస్థకు ఓ రూ.10 కోట్లు ఇచ్చి సినిమాపై వివాదం రేగకుండా ఉండేలా చూసేందుకు డైరెక్టర్ త్రివిక్రమ్ ప్లాన్ చేస్తున్నాడట. మరి కొందరైతే ఈ సినిమా అత్తారింటికి దారేది సినిమాను అటు తిప్పి ఇటు తిప్పి మళ్లీ తీశాడని కొందరు కామెంట్స్ చేస్తున్నారు. మరి ఏది నిజమో సినిమా చూస్తేనేగాని చెప్పలేం. మరి ఈ సినిమా విడుదల సమయానికి అసలు వివాదాలు రేగకుండా ఉండేందుకు గాను టిసీరీస్ తో దర్శక నిర్మాతలు 10  కోట్ల డీల్ నిజమనే న్యూస్ మాత్రం ఫిలింసర్కిల్స్ లో గట్టిగా వినబడుతుంది.

Agnyaathavaasi copy issue Ends with 10 crores:

10 crores loss to ‘Agnyaathavaasi’ with Copy Issue

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement