Advertisement

ప్రదీప్ ఎక్కడికీ పోలేదు..!!

Fri 05th Jan 2018 09:34 PM
pradeep,drunk and drive case,  ప్రదీప్ ఎక్కడికీ పోలేదు..!!
Anchor Pradeep accepts his mistake ప్రదీప్ ఎక్కడికీ పోలేదు..!!
Advertisement

గత ఏడాది అంటే డిసెంబర్ 31న తప్పతాగి పోలీస్ లకు పట్టుబడిన యాంకర్ ప్రదీప్... పోలీసులు ఇచ్చే కౌన్సిలింగ్ కి హాజరుకాకుండా తప్పించుకు తిరుగుతున్నాడని.. పోలీస్ లు  నోటీసులు ఇచ్చేందుకు ప్రయత్నించినా ప్రదీప్ మాత్రం వారికి దొరకకపోవడంతో.. ప్రదీప్ పరారీ అంటూ నిన్న గురువారం మీడియాలో కథనాలు ప్రసారం అయ్యాయి. కేవలం మద్యం మత్తు మాత్రమే కాకుండా రాష్ డ్రైవింగ్, నిబంధనలకు విరుద్ధంగా బ్లాక్ గ్లాస్ లు వాడుతున్న ప్రదీప్ పై పలు కేసులు ఉన్నట్టుగా వార్తలొచ్చాయి. అలాగే ప్రదీప్ మద్యం మత్తులో ఊగుతూ వాహనాలు నడపొద్దని.. డ్రంక్  అండ్ డ్రైవ్ తో పోలీసులకు పట్టుపడొద్దని... నీతులు చెప్పిన వీడియో సోషల్ మీడియాలో ఒక రేంజ్ లో చక్కర్లు కొట్టింది. అలాగే ప్రదీప్ పోలీస్ లకు దొరక్కుండా అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడని వార్తలు మీడియాలో హైలెట్ అయ్యాయి.

యాంకర్ ప్రదీప్ పరారీ, అజ్ఞాతం అనే వార్తలకు స్పందిస్తూ ప్రదీప్ ఒక వీడియో మెసేజ్ ని మీడియాకి పంపాడు. అందులో తాను ఎక్కడికి పారిపోలేదని.. తాను ఇంతకుముందు కమిట్ అయిన షూటింగ్స్ తో బిజీగా ఉండడం వల్లనే తాను ట్రాఫిక్ పోలీస్ లు ఇచ్చే కౌన్సిలింగ్ కి హాజరుకాలేకపోయానని... కానీ పోలీసులు ఇచ్చే కౌన్సిలింగ్ కి తప్పకుండా హాజరవుతానని... అలాగే లా నిబంధనలను తప్పకుండా ఫాలో అవుతానని.. తనలాగా ఎవరూ తాగి వాహనం నడపొద్దని మరీ ఆ వీడియోలో ప్రదీప్ చెప్పడం విశేషం. ఇక ప్రదీప్ ఈ రోజు పోలీస్ లకు ఇచ్చే కౌన్సిలింగ్ కి హాజరవుతాడని అంటున్నారు. ఎందుకంటే డిసెంబర్ 31 న పట్టుబడిన వారికి పోలీస్ లు ఇచ్చే కౌన్సిలింగ్స్ కి ఈ రోజే ఆఖరి రోజు. అందుకే ఈ రోజు ప్రదీప్ కౌన్సిలింగ్ కి హాజరయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. 

Click Here to see the Video

Anchor Pradeep accepts his mistake:

Pradeep accepts his mistake

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement