ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Keerthi Suresh Pinch Pawankalyan Cheeks

పవన్ ని ముద్దు చేస్తున్న హీరోయిన్!!

త్రివిక్రమ్ - పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం 'అజ్ఞాతవాసి'. ఈ చిత్రం పై టాలీవుడ్, పవన్ ఫాన్స్ మంచి ఎక్సపెక్టషన్స్ తో వున్నారు. ఈ చిత్రంకి సంబంధించి ఏ పోస్టర్ విడుదల అయిన అది వైరల్ అవుతూ వస్తుంది. అలానే లేటెస్టుగా రిలీజ్ అయిన ఓ లుక్ కూడా సోషల్ మీడియా లో వైరల్ అయింది. ఈ పోస్టర్ లో కీర్తి సురేష్, పవన్  బుగ్గలను గిల్లుతూ దర్శనమిస్తోంది.

స్టైలిష్ లుక్‌లో పవన్.. నవ్వుతూ ప్రేమగా ఆయన బుగ్గలను గిల్లుతున్న కీర్తిసురేష్ లుక్స్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంటున్నాయి. ఈ లుక్ ను సోషల్ మీడియా త్రివిక్రమ్ ఫాన్స్ విడుదల చేసారు. బయటికి వచ్చిన ఈ లుక్ తో సినిమాపై మరింత ఎక్సపెక్టషన్స్ ఎక్కువ అయ్యాయి.

ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయిపోయి పోస్ట్ ప్రొడక్షన్ లో బిజీగా వుంది. 2018 జనవరి 10న సినిమా మన ముందుకు రాబోతుంది. ఈ చిత్రానికి అనిరుద్ అందిస్తున్న సంగీతం స్పెషల్ అట్రాక్షన్‌గా నిలువనుంది. 'అజ్ఞాతవాసి' చిత్రంలో పవన్ సరసన కీర్తి సురేష్, అనూ ఇమ్మాన్యుయేల్ ఆడిపాడుతున్నారు.

Keerthy Suresh Pawan Kalyan Chemistry Sizzles

Keerthi Suresh Pinch Pawankalyan Cheeks
keerthy suresh
pawan kalyan
agnathavasi