ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Pawan Kalyan Latest Stills sensation in Social Media

‘అజ్ఞాతవాసి’ అని స్టిల్స్ చెప్పేస్తున్నాయ్!

పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న చిత్రం అంటే జనాలలో భారీ ఎక్సపెక్టేషన్స్ ఉంటాయి. ఈ సినిమాకి సంబంధించి అఫీషియల్ గా ఒక్క పోస్టర్ కూడా రిలీజ్ చేయలేదు చిత్ర యూనిట్. అయితే ఈ సినిమాకి అజ్ఞాతవాసి టైటిల్ అని ఫైనల్ అయినట్టు తెలుస్తుంది.

అయితే ఈ సినిమాకి సంబంధించి కొన్ని వర్కింగ్ స్టిల్స్ ను అఫీషియల్ గా విడుదల చేసింది చిత్ర యూనిట్. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఆ ఫొటోస్  కనపడుతున్నాయి. వాట్సాప్, ఫేస్ బుక్, ట్విట్టర్, ఇన్ స్టాగ్రామ్ ఇలా ఎక్కడ చూసిన ఈ ఫొటోలే. అయితే ఈ ఫొటోస్ ని కావాలనే చిత్ర బృందం ఇలా విడుదల చేసినట్టు తెలుస్తుంది. సినిమా పై భారీ  హైప్ పెంచేందుకే ఈ ఫొటోస్ సోషల్ మీడియా లోకి వదిలారు. విడుదల చేసిన ఫొటోస్ కు పవన్ ఫాన్స్ పండగ చేసుకుంటారు. మరి అజ్ఞాతవాసి టైటిల్ విడుదల చెయ్యకుండానే జనాల్లోకి ఎలా చొచ్చుకు పోయిందో... ఇప్పుడు తాజాగా పవన్ కళ్యాణ్, త్రివిక్రమ్ ల PSPK 25 వర్కింగ్ స్టిల్స్ కూడా అభిమానులకే కాకుండా సగటు ప్రేక్షకుడికి ఎక్కడ తగలాలో అక్కడ తగిలి సినిమాపై అంచనాలు అమాంతం పెంచేసాయి. 

ఇక ఈ స్టిల్స్ఈ పవన్ కళ్యాణ్ చాల స్టైలిష్ పైగా... కూల్ గా అందంగా కనబడుతున్నాడు. అజ్ఞాతవాసి టైటిల్ కి తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ ఒంటరిగా కూర్చుని ఆలోచించడం మొదలు.... స్నేహితుడు త్రివిక్రమ్ తో పవన్ ముచ్చట్లు ఇలా... అన్నిరకాలుగా ఆ స్టిల్స్ అందరిని ఆకట్టుకుంటున్నాయి. ఈ సినిమా ప్రస్తుతం యూరోప్ లో షూటింగ్ జరుపుకుంటుంది. ఈ షూటింగ్ కంప్లీట్ అయిన తర్వాత డిసెంబర్ 14న ఆడియో రిలీజ్ చేసి, జనవరి 10న సినిమాను రిలీజ్ చేయాలని భావిస్తున్నారు.

Pawan Agnathavasi in PSPK25 Stills

Pawan Kalyan Latest Stills sensation in Social Media
pawan kalyan
trivikram srinivas
pspk 25 stills
pawan agnathavasi