Advertisement

జరిగింది జరిగినట్లుగా చూపిస్తా: వర్మ!

Tue 10th Oct 2017 11:16 AM
ram gopal varma,balakrishna,lakshmis ntr movie,jd chakravarthi  జరిగింది జరిగినట్లుగా చూపిస్తా: వర్మ!
Aagani Varma Sensational Comments On Lakshmis NTR జరిగింది జరిగినట్లుగా చూపిస్తా: వర్మ!
Advertisement

రాంగోపాల్‌వర్మను కొందరు ట్విట్టర్లతో రెచ్చిపోతుంటాడు కాబట్టి ఆయనను చెవ్వుల్లో గోల పెట్టే గోలయ్యగా భావిస్తుంటారు. ఇక విషయానికి వస్తే రాంగోపాల్‌వర్మ ఏదైనా పనిని తమాషాగా ఉంటుంది... ఒక రాయి వేసి చూద్దాం.. అని ఏదో ఒక వివాదాస్పద అంశాన్ని కలబెడతాడు. దానికి ఆయనకు మంచి స్పందనతో పాటు మంచి వివాదం చెలరేగితే మాత్రం తాననుకున్నది ఖచ్చితంగా తీసి తీరతాడు. ఆయన అసలే కల్లు తాగిన కోతి. దానికితోడు ఆయనకు ఎవరైనా భయపెట్టాలని చూసినా, తనకు వ్యతిరేకంగా ఏమైనా మాట్లాడినా అసలు ఒప్పుకోలేదు. ఆయనలోని ఇగో దెబ్బతిన్నది అంటే అది మోదీ నుంచి చంద్రబాబు వరకు ట్రంప్‌, స్పీల్‌బర్గ్‌ నుంచి ఎవరైనా ఆయన అదే తరహాలో ప్రవర్తిస్తాడు. ఆయన్ను చాలా దగ్గరి నుంచి చూసిన వారికి ఆ విషయం బాగా తెలుసు. కాగా వర్మ ప్రస్తుతం 'లక్ష్మీస్‌ ఎన్టీఆర్‌' అనే చిత్రం తీస్తానని, ఎన్టీఆర్‌ జీవితాన్ని లక్ష్మీపార్వతి కోణంలో చూపించనున్నాడనే విషయం సంచలనంగా మారింది. 

అదే టిడిపి నేతలు మౌనంగా ఉండి ఉన్నా, బాలయ్య వంటి వారు పూరీ చేత చెప్పించి ఉన్నా దానిని కూడా ఓ శశికళ, రెడ్డిగారు పోయారు, సావిత్రి వంటి చిత్రాల తరహాలో తమాషాగా తీసుకునే వాడు. కానీ ఆయనకు ఏకంగా టాలీవుడ్‌ నుంచి ఈ సినిమా ఎలా తీస్తావో చూద్దామని బెదిరింపులు కూడా వెళ్లాయట. ఇక టీవీలలో కూడా టిడిపి నాయకులు ఆయన్ను ఏవేవో అనేశారు. దాంతో హడావుడిగా ఈ చిత్రం ప్రీలుక్‌ని కూడా రిలీజ్‌ చేశాడు. ఎవరూ కాకపోతే తన శిష్యుడు జెడిచక్రవర్తి ఆ చిత్రాన్ని తానే నిర్మిస్తానని ముందుకొచ్చాడు. కానీ వర్మ తలుచుకుంటే నిర్మాతలకు కొదువా. దీంతో ఆయన జెడిచక్రవర్తిని కాదని చెప్పి స్వయంగా వైయస్సార్‌సీపీ నేతనే దీనికి నిర్మాతగా ప్రకటించేశాడు. 

వైసీపీ నేత పి.రాకేష్‌రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాడని, తాను కూడా రాజకీయాలకు అతీతంగా కేవలం నిజాలను బయటపెట్టడానికే చిత్రం తీస్తున్నానని, ఇక ఇదే తన అంతరంగమని, ఈ చిత్రాన్ని వైసీపీ నేత కూడా రాజకీయాలకోసం తీయడం లేదని, నిజాలను బయటపెట్టేందుకే ఈ ప్రయత్నమని వర్మ సోషల్‌మీడియా ద్వారా క్లారిటీ కూడా ఇచ్చేశాడు. ఒకవైపు వర్మ ఉరుకులు పరుగుల మీద ఉన్నాడు. దావూద్‌, అబూలు, బాల్‌థాకరేలు, కసబ్‌ వంటి వారి బెదిరింపులకే భయపడనని తనని ఎవడు ఎందుకు భయపెడతాడో చూస్తానని తన సన్నిహితుల వద్ద శపథం కూడా చేశాడట. మొత్తానికి బాలయ్య చిత్రం మాత్రం చాలా లేటయ్యేలా కనిపిస్తుండగా, వర్మ మాత్రం అనుకుంటే ఒకనెలలోనే చేతిలో ఫస్ట్‌కాపీ కూడా పెట్టేస్తాడు. త్వరలోనే ఆయన తన నటీనటులను, ఇతర విషయాలను కూడా వెల్లడిస్తానని తెలిపాడు.సో.. వర్మ ఈజ్‌ రెడీ.. మరి బాలయ్య సంగతేంటి...?

Aagani Varma Sensational Comments On Lakshmis NTR:

RGV Interesting Comments on Lakshmis NTR

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement