Loading...
ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Virat Kohli and Anushka Sharma Enters into Hotel Business

ప్రేమ జంట ముందుచూపు అదిరింది!

Virat Kohli and Anushka Sharma Enters into Hotel Business

ఎంతో కాలంగా ప్రస్తుత టీం ఇండియా క్రికెట్‌ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లికి, బాలీవుడ్‌ స్టార్‌ హీరోయిన్‌ అనుష్కశర్మకి ప్రేమాయణం సాగుతున్న సంగతి తెలిసిందే. క్రికెట్‌ ఆడేందుకు విరాట్‌ ఏదేశం వెళ్లితే అక్కడ అనుష్క ప్రత్యక్షమైతీరేది. ఇక క్రికెటర్లకు, హీరోయిన్లకు కూడా లాంగ్‌ కెరీర్‌ ఉండదు. హీరోయిన్లు 30 యేళ్ల లోపలే ఫేడవుట్‌ అయితే, క్రికెటర్లు ఎంత ఫిట్‌గా ఉన్నా 38 ఏళ్లకు అటుఇటుగా రిటైర్‌మెంట్‌ ఎదురు చూస్తూ ఉంటుంది. దీంతో విరాట్‌ కోహ్లి-అనుష్కశర్మల జంట ముందు చూపుతో ఓ నిర్ణయం తీసుకుంది. 

ఇప్పుడు తాము బాగా లైమ్‌లైట్‌లో ఉన్నామని, తమ కెరీర్‌ పీక్స్‌లో ఉంది కాబట్టి.. ఇప్పడే భవిష్యత్తు ప్రణాళికలు రచిస్తున్నారు. దీనికి అనుగుణంగా వీరిద్దరు కలిసి అంతర్జాతీయ స్థాయిలో రెస్టారెంట్‌ బిజినెస్‌లోకి అడుగుపెట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పటికే ఈ రెస్టారెంట్ల కోసం డిల్లీ, ముంబైలలో స్థలాలను కూడా కొన్నారట. త్వరలో ఈ బిజినెస్‌ని స్టార్ట్‌ చేసి అంతర్జాతీయ స్థాయిలో వాటిని విస్తరించాలనే ఉద్దేశ్యంతో ఉన్నారు. 

ప్రస్తుతం ఇద్దరు వ్యక్తిగతంగా తిరుగులేని ఫామ్‌లో ఉన్నారు కాబట్టి ఇప్పుడే ఆ బిజినెస్‌ని స్టార్ట్‌ చేస్తే ఎంతో ఉచితంగా, భారీ స్థాయిలో పబ్లిసిటీ వస్తుందని వీరు భావిస్తున్నారు. సో.. వీరు ఈ వ్యాపారానికి ఇప్పటినుంచే ప్రణాళికలు రచిస్తున్నారు. మరి వీరు ఈ బిజినెస్‌ మొదలు పెట్టడానికి ముందే వివాహం చేసుకుంటారా? లేక వ్యాపారం మొదలు పెట్టిన తర్వాత ఒకటవుతారా? అనేది ఆసక్తికరంగా మారింది. 

Virat Kohli, Anushka Sharma have business plans together

virat kohli
anushka sharma
hotel business