ముందు చూపులో ఈ భామ సూపర్..!

నేడున్న హీరోయిన్లు ఒక్కప్పటి వారిలా లేరు.. బాగా తెలివి మీరి పోయారు. ఎంతో ముందుచూపుతో అడుగులు వేస్తున్నారు. హీరొయిన్లగా హవా తగ్గిన తర్వాత కూడా ఏం చేయాలి? ఏ బిజినెస్ చేయాలో చూసుకుంటున్నారు.తాము ఫేడవుట్ అయిన తర్వాత ఎన్ని పరిచయాలున్నా ఎవ్వరూ సాయం చేయరని గ్రహించి, ఫేమ్‌లో ఉన్నప్పుడే ఏదో బిజినెస్ చేసి తమకున్న టచస్‌తో వాటికి పబ్లిసిటీ ఇచ్చేలా చేసుకుంటూన్నారు.
ఇక ఈ విషయంలో స్టార్ రకుల్‌ప్రీత్‌సింగ్ చాలా ముందజలో ఉంది. ఇప్పటికే ఆమెకు ఓ వ్యక్తి ఇల్లు ఉచితంగా గిఫ్ట్‌గా ఇచ్చాడనే ప్రచారంజరుగుతోంది. దీనిని ఆమె ఖండించినా కూడా అదే నిజమనే వార్తలు హల్‌చల్ చేస్తున్నాయి. ఆల్‌రెడీ సైడ్ బిజినెస్ కూడా చూసుకుంది ఈ డిల్లీ భామ. ఇక మన స్టార్స్ ఇప్పుడు బహుభాషా చిత్రాలను చేయడానికి ఆసక్తి చూపుతున్నారు.దాంతో పలు భాషల్లో గుర్తింపు ఉన్న వారికే చాన్స్‌లు ఇస్తున్నారు. ఆల్‌రెడీ ఈమెకు కోలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌లో కూడా కాసింత పరిచయం ఉంది.
ఇక మహేష్-మురుగదాస్‌ల 'స్డైడర్'లో నటిస్తోంది. ఈ చిత్రం ద్వారా తెలుగుతోపాటు కోలీవుడ్‌ని కూడా టార్గెట్ చేసింది. ఇక మన ప్రభాస్ నుంచి మహేష్, బన్నీలు కూడా ఇప్పుడు బాలీవుడ్‌వైపు చూస్తున్నారు. దాంతో వారి భవిష్యత్తు చిత్రాలు తెలుగులోనే గాక తమిళం,మలయాళంతో పాటు హిందీలో కూడా రిలీజ్ అయ్యే అవకాశాలు స్పష్టంగా ఉన్నాయి. ఆల్‌రెడీ మన తెలుగు చిత్రాలకు హిందీలో శాటిలైట్, డిజిటల్, యూట్యూబ్‌లలో మంచి ఆదరణ లభిస్తోంది.
దీంతో బాలీవుడ్‌లో మరింత క్రేజ్‌పెంచుకోవాలని నిర్ణయించుకున్న రకుల్ తాజాగా ఓ బాలీవుడ్ సినిమాకి సైన్ చేయడమే కాదు..బికీనీలో కూడా నటించేందుకు ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. తనతో పాటు టాలీవుడ్‌కి కూడా పరిచయమైన సహచర నటీమణులందరూ అవకాశాలు లేక అల్లాడుతుంటే ఈవిడ మాత్రం తన ముందుచూపతో అదరగొడుతోంది.
Recently Rakul Preet Singh signed a bollywood movie. In this movie rakul it seems okay to act in bikini dress.
Rakul Preet Singh Signed A Bollywood Movie






































