ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Gauthami Shocking Comments on Casting Couch

గౌతమి చెప్పింది రైటా..రాంగా..!

కమల్‌ హాసన్‌తో ఏకంగా 13ఏళ్లు సహజీవనం చేసింది వైజాగ్‌ భామ గౌతమి. కాగా కమల్‌తో విడిపోవడానికి రెండేళ్లకు పైగా టైంతీసుకుని విడిపోయానంటోంది. ఇక జీవితంలో మనం అనుసరించని వాటిని మనం ఇతరులు చేసినా అంగీకరించం. పెళ్లిలో గానీ టీచర్‌ - స్టూడెంట్స్‌ రిలేషన్‌ నుంచి అన్నాచెల్లెలు, తల్లిదండ్రులు, పిల్లలు, సహోద్యోగులు- ఇలా ఏ సంబంధానికైనా నమ్మకం అనేది ముఖ్యం. 

అది ఉంటే ఏమైనా చేయవచ్చు. దానికి మీరు సహజీవనంతో పాటు ఏ పేరు పెట్టినా నేనేమీ పట్టించుకోనని మొత్తానికి తల్లిదండ్రులు, అన్నాచెల్లెల సంబంధాన్నికూడా రచ్చకీడ్చింది. ఇక కాస్టింగ్‌ కౌచ్‌ గురించి మీకు ఇప్పుడు తెలిసిందేమో. ఒక్క సినిమా రంగంలోనే కాదు.. అన్ని రంగాలలోనూ ఇది ఉంది. మనం కొన్ని సాధించడానికి కొన్నింటిని వదిలేస్తాం. కొన్నిటి కోసం కొన్నిటిలో రాజీ పడతాం. కాబట్టి రాజీ పడటం వల్ల మనం రాజీ పడిన దాని కంటే ఎక్కువ ప్రతిఫలం వస్తుందా? లేదా? అన్నదానిపై కాస్టింగ్‌కౌచ్‌పై ఎవరికి వారు నిర్ణయం తీసుకోవాలని చెప్పి, తన మేదస్సునంతా జనాల మీదకు వదలడానికి, క్లాస్‌లు పీకడానికి కేటాయించింది మరి...! 

In life only commitment is the core of any relationship and there is nothing like pro-tradition and anti-tradition, Gautami said.

Gauthami Shocking Comments on Casting Couch
gautami
kamal haasan
relationship
gautami heroine
casting couch