పవన్‌ తో మళ్లీ సరైన పాత్రలో చేస్తున్నాడంట!

Adhi Reveals His Role in PSPK 25

Mon 19th Jun 2017 04:58 PM
Advertisement
pawan kalyan,sarainodu,aadhi pinishetty,trivikram srinivas,ninnu kori  పవన్‌ తో మళ్లీ సరైన పాత్రలో చేస్తున్నాడంట!
Adhi Reveals His Role in PSPK 25 పవన్‌ తో మళ్లీ సరైన పాత్రలో చేస్తున్నాడంట!
Advertisement

తమిళ సినిమాలలో హీరోగా చలామణి అవుతూ అప్పుడప్పుడూ తమిళ డబ్బింగ్ సినిమాలతో తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్న ఆది పినిశెట్టికి టాలీవుడ్ లో హీరోగా కంటే విలన్ గానే మంచి పేరొచ్చింది. ఒకే ఒక్క టాలీవుడ్ సినిమా ఆది కెరీర్ ని మలుపు తిప్పింది.... అనడంలో ఏమాత్రం సందేహం లేదు. బోయపాటి శ్రీను ఆ అదృష్టాన్ని ఆదికి 'సరైనోడు' చిత్రంతో కల్పించాడు. 'సరైనోడు'లో అల్లు అర్జున్ హీరో అయితే ఆది విలన్. కానీ హీరోతో సరిసమానమైన కేరెక్టర్ ఆదికి ఇచ్చి అతని కెరీర్ ని 'మలుపు' తిప్పాడు బోయపాటి. అద్భుతమైన నటనతో విలన్ గా ఆదిపినిశెట్టి అదరగొట్టాడు. 

ఇక ఆ చిత్రం విజయంతో ఆది ఒక పక్క హీరోగా సినిమాలు చేస్తూనే మరోపక్క వచ్చిన విలన్ అవకాశాలను అందిపుచ్చుకుంటూ దూసుకుపోతున్నాడు. 'మరకతమణి' తో తాజా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఆది మరో చిత్రం 'నిన్ను కోరి' లో విభిన్న పాత్రతో మెప్పించడానికి జులై లో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అంతేకాకుండా రామ్ చరణ్ సినిమాలో ఒక కీ రోల్ చేస్తున్న ఆది పినిశెట్టి...... పవన్ కళ్యాణ్ - త్రివిక్రమ్ చిత్రంలో మరోసారి విలన్ గా నటిస్తున్నాడు. మరి అదిరిపోయే కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో ఆది విలన్‌గా నటించడాన్ని బాగా ఎంజాయ్‌ చేస్తున్నాడట.

పవన్‌కి, తనకి మధ్య సీన్లు చాలా బావుంటాయని....  ఈ క్యారెక్టర్‌తో తనకి విపరీతమైన పేరు వస్తుందని..... నటుడిగా తన స్థాయిని ఎన్నో రెట్లు పెంచుతుందని ఆది ఆశగా చెబుతున్నాడు. 

Advertisement

Adhi Reveals His Role in PSPK 25:

Adhi is now doing a crucial role in Power Star Pawan Kalyan and Trivikram's most awaited project. Adhi, himself, has given a hint about his role in the film.

Advertisement

Loading..
Loading..
Loading..
advertisement