అదరగొడుతోన్న యంగ్‌టైగర్‌..!

Sun 18th Jun 2017 07:20 PM
star maa channel,bigg boss show,jr ntr  అదరగొడుతోన్న యంగ్‌టైగర్‌..!
Jr NTR Bigg Boss Show Promo in Star Maa అదరగొడుతోన్న యంగ్‌టైగర్‌..!
Sponsored links

ఎప్పుడైతే స్టార్‌ మా టీవీ తమ 'బిగ్‌బాస్‌'షోకి జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఓకే చేసిందో అప్పటి నుంచి ఈ కార్యక్రమంపై హైప్స్‌ బాగా క్రియేట్‌ అయ్యాయి. బుల్లితెర కార్యక్రమం అయినా కూడా పెద్ద పెద్ద సినిమాలకు ధీటుగా ఈ చిత్రానికి ప్రమోషన్‌ కార్యక్రమాలు జరుగుతున్నాయి ఇప్పటికే కొంటెగా కన్నుగీటుతూ కనిపిస్తున్న యంగ్‌టైగర్‌ తన లుక్‌తో బీభత్సమైన హైప్‌ క్రియేట్‌ చేశాడు. తాజాగా ఈ షో ప్రోమోను కూడా స్టార్‌ మా టీవీ భారీఎత్తున రీలీజ్‌ చేసింది. 

ఇందులో వస్తున్న థీమ్‌ మ్యూజిక్‌, గ్రాఫిక్స్‌ జోడింపు వరకు అన్ని అదరహో అనే లెవల్‌లో ఉన్నాయి. ఈ థీమ్‌జేమ్స్‌బాండ్‌ చిత్రాల ధీముల మాదిరి ఉంది. దీనిని తమనే అందించి ఉంటే అతనికి హ్యాట్సాఫ్‌ చెప్పాల్సిందే. చివరలో కోట్‌కు బటన్‌ పెట్టుకుంటూ ఫుల్‌ప్లెడ్జ్‌డ్‌గా యంగ్‌టైగర్‌ తన కోటుకి బటన్‌ పెట్టుకుంటూ ప్రోమోకు అద్భుతమైన ఫినిషింగ్‌ టచ్‌ ఇచ్చాడు. 

మొత్తానికి ఈ కార్యక్రమానికి ఎంత ఖర్చుపెడుతున్నారు.. ఎన్టీఆర్‌ ఎంత రెమ్యూనరేషన్‌ తీసుకుంటున్నాడు.. అనే విషయాలను పక్కనపెడితే జూనియర్‌ని ఎంచుకోవడం వల్లే ఈ కార్యక్రమానికి ఇంత హైప్‌ క్రియేట్‌ అవుతోంది అన్న మాట మాత్రం వాస్తవం. 

Sponsored links

Jr NTR Bigg Boss Show Promo in Star Maa:

Hypes have been created on the show since the star maa has just turned our junior NTR into their 'Bigg boss' show. The Recently release of the show promo is also aired by our star Maa TV.

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019