బన్నీ తో ఛాన్సే..బాగా డిమాండ్ పెంచేసింది..!

Thu 08th Jun 2017 06:42 PM
pooja hegde,1 crore,allu arjun,sreevas,bellamkonda srinivas,pooja hegde  బన్నీ తో ఛాన్సే..బాగా డిమాండ్ పెంచేసింది..!
Pooja Hegde Dimands 1 Crore for Sreevas Film బన్నీ తో ఛాన్సే..బాగా డిమాండ్ పెంచేసింది..!
Sponsored links

'డీజే దువ్వాడ జగన్నాథం' చిత్రంలో 'బడిలో ఒడిలో' అంటూ అందాల ఆరబోతతో పూజ హెగ్డే హాట్ టాపిక్ అయ్యింది. టాలీవుడ్ లో 'ముకుందా'తో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ  నాగ చైతన్యతో 'ఒక లైలా కోసం' లో చేసి నటన పరంగా మంచి మార్కులే కొట్టేసింది కానీ సూపర్ హిట్ సాధించలేకపోయింది. ఇక 'మోహింజదారో' చిత్రంతో బాలీవుడ్ లో పాతుకుపోదామని ప్లాన్ చేసి ఘోరంగా దెబ్బతినడంతో మళ్లీ  సౌత్ కొచ్చి పడింది. ఇక్కడ అల్లు అర్జున్ కి జోడిగా మోడరన్ గర్ల్ గా గ్లామర్ షోకి తెర తీసింది. ఇక ఇప్పుడు పూజ హెగ్డే డిమాండ్ బాగా పెరిగిందనే టాక్ వినబడుతుంది.

అయితే బెల్లంకొండ సంస్థానంలో హీరోయిన్స్ కి ఎలాంటి డిమాండ్ ఉంటుందో శ్రీనివాస్ మొదటి చిత్రం దగ్గర నుండి చూస్తూనే వున్నాం. ఇప్పుడు పూజ హెగ్డే కూడా కళ్ళు చెదిరే ఆఫర్ తో బెల్లంకొండ సంస్థానంలోకి పూజ అడుగుపెట్టబోతుందని చెబుతున్నారు. బెల్లంకొండ శ్రీనివాస్ మొదటి చిత్రం 'అల్లుడు శీను' దగ్గర నుండి బెల్లంకొండ సురేష్ టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ ని భారీ పారితోషకాన్ని ఆఫర్ చేసి తన కొడుకు పక్కన నటింపజేస్తున్నాడు. ఇప్పుడు కూడా తాజాగా  బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా శ్రీవాస్ డైరక్షన్ లో ఓ సినిమా ప్రారంభమైనది.

ఈ చిత్రంలో శ్రీనివాస్ కి జోడిగా పూజ హెగ్డేని సంప్రదించగా... ఆమె ఒక కోటి రూపాయలతో సహా దానికి సర్వీస్ టాక్స్ కూడా అడిగినట్లు వార్తలొస్తున్నాయి. పూజతో చర్చలు జరుపుతున్నారని... ఇంకా ఈ చిత్రానికి పూజని ఫిక్స్ అయితే చెయ్యలేదని అంటున్నారు. మరోపక్క కోటి రూపాయల రెమ్యునరేషన్ కి పూజ, శ్రీనివాస్ పక్కన హీరోయిన్ గా సెట్ అయ్యిందనే వార్తలొస్తున్నాయి.

Sponsored links

Pooja Hegde Dimands 1 Crore for Sreevas Film:

Pooja Hegde Takes 1 Crore Rupees For Bellamkonda Srinivas and Director Sreevas Film. 

Latest

Latest

Popular in Times

Follow us

Contact us    Privacy     © 2019