ఆంగ్ల హోమ్ >> తెలుగు వార్తలు >> Baahubali 2 Movie Release in China Soon!

'దంగల్‌'ని కొట్టాలనే ఆశ...!

వాస్తవానికి 'దంగల్‌' చిత్రం ఇండియాలో ఎప్పుడో రిలీజ్‌ అయింది. కానీ ఆ తర్వాత ఈ చిత్రాన్ని పాకిస్తాన్‌లో రిలీజ్‌ చేయడానికి ఏర్పాట్లు, అందులోని భారతపతాకం సీన్లపై పాకిస్తాన్‌ సెన్సార్‌ అభ్యంతరం చెప్పడం, అమీర్‌ సినిమా నుండి ఈ సీన్‌ తగ్గేందుకు ఒప్పుకోకపోవడం వంటివి జరిగాయి. దాంతో ఈ చిత్రాన్ని చైనాలో రిలీజ్‌ చేయడం కాస్త లేట్‌ అయింది. లేటయినా సరే స్వయంగా అమీరే చైనా వెళ్లి మరీ ప్రమోషన్‌ చేసి వచ్చాడు. 

ఇక ఈ చిత్రం అక్కడ దుమ్మురేపుతూ 1000కోట్లను ఒక్క చైనాలో వసూలు చేయడం చిన్న విషయం కాదు. ఇక 'బాహుబలి-ది బిగినింగ్‌' విషయానికి వస్తే ఇది చైనాలో రిలీజ్‌ అయినా కూడా బాగా నష్టాలు వచ్చాయి. విదేశీ చారిత్రక తరహా చిత్రాలను బాగా ఆదరించే చైనీయులు ఎందుకనో 'బాహుబలి-ది బిగినింగ్‌'ను పెద్దగా పట్టించుకోలేదు. ఇక 'దంగల్‌' ఇచ్చిన ఊపుతో 'బాహుబలి-ది కన్‌క్లూజన్‌'ను కూడా భారీ స్థాయిలో చైనాలో విడుదల చేయడానికి సన్నాహాలు జరుగుతున్నాయి. 

త్వరలో ఈ చిత్రం ప్రమోషన్‌ కోసం ప్రభాస్‌, అనుష్క ఇద్దరూ చైనాలో పర్యటించనున్నారు. మొత్తానికి 'బాహుబలి' పుణ్యమా అని ఐదేళ్ల, దానికి ముందు 'మిర్చి' సమయంలో కూడా కొన్ని నెలలు గడిపిన ప్రభాస్‌-అనుష్కలు చైనాలో పర్యటించనున్నారని తెలిసిన వెంటనే మన గాసిప్‌రాయుళ్లు మరోసారి వీరిద్దరి మధ్య సమ్‌థింగ్‌, సమ్‌థింగ్‌ అంటూ దీనినో విహారయాత్రగా పబ్లిసిటీ చేస్తున్నారు. మొత్తానికి ఈ చిత్రం ద్వారా 'దంగల్‌' కంటే ఎక్కువ కలెక్షన్లు సాధించాలన్న 'బాహుబలి' నిర్మాతల ఆశ నెరవేరానా? లేదా? అనేది చూడాలి...! 

In fact, the film 'Dangal' was released in India. This film has become lazy to release in China. It is not a small thing to collect 1000 crores in China. 'Baahubali-The Conclusion' is also being planned to be released in China on a large scale.

Baahubali 2 Movie Release in China Soon!
dangal movie
aamir khan
baahubali 2 movie
prabhas
anushka
china
Advertisement
Advertisement