సమంతకు ఆ పిక్ తో కష్టాలొచ్చిపడ్డాయే..!

టాలీవుడ్ లో హీరోయిన్స్ పెళ్లి పీటలెక్కుతున్నారు అంటే కాస్త సంప్రదాయంగా కనబడానికే ఎక్కువగా ట్రై చేస్తుంటారు. ఇక పెళ్లి అయ్యాక కొన్నాళ్ల పాటు ఫ్యామిలీ లైఫ్ ని ఎంజాయ్ చేశాక మళ్లీ రీ ఎంట్రీ అంటూ అడుగుపెట్టే హీరోయిన్స్ ని మనం చాలా మందిని చూస్తున్నాం. వీరికి భిన్నంగా సమంత మాత్రం పెళ్లి అనగానే గ్లామర్ షో పెంచేసింది. నాగ చైతన్య తో ప్రేమ వ్యవహారం బయటికి పడ్డాక.... పార్టీలకి, పబ్బులకి చైతుతో కలిసి సామ్ హాట్ హాట్ గా కనిపిస్తూ హడావిడి చేస్తుంది. జనవరిలో ఎంగేజ్మెంట్ చేసుకున్న సమంత త్వరలో చైతుతో పెళ్లి పెట్టలేక్కబోతుంది. అక్కినేని వారింట కోడలిగా కాలు పెడుతున్న సమంత  గ్లామర్ ప్రపంచం నుండి బయటకువచ్చి చాలా డీసెంట్ గా మారుతుందని అక్కినేని అభిమానులు ఎక్సపెక్ట్ చేశారు . కానీ సమంత మాత్రం సినిమాలతో బిజీగా ఉంటూనే హాట్ హాట్ ఫోటో షూట్స్ తో పిచ్చెక్కించేస్తోంది.

అలా తీసే ఫొటోషూట్ ఫొటోస్ ని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హల్చల్ చేస్తుంది. అయితే ఇది ఏమాత్రం అక్కినేని అభిమానులకి రుచించడం లేదు. ఇక ఇప్పుడు తాజాగా సామ్ ఒక బికినీ డ్రెస్ ని తన ఇన్స్ట్రాగ్రమ్  లో పోస్ట్ చేసింది. అయితే మొన్నా మధ్యన హాట్ లుక్ తో కనబడిన సమంత ఇప్పుడు ఈ ఫోటో ని షేర్ చెయ్యగానే... ఇల్లాలు కాబోతున్న ఈ టైం లో ఇలాంటి పిచ్చి వేషాలేమిటి అని సామ్ మీద ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు అభిమానులు. మరి కొందరు సమంతాని తెగ తిట్టి పోస్తున్నారు. అయితే అలాంటి వారందరికీ సమంత ఘాటైన రిప్లై ఇచ్చింది. కేరెక్టర్ ని బట్టి కాకుండా డ్రెస్ ని బట్టి ఒకరి వ్యక్తిత్వాన్ని డిసైడ్ చేసే మీలాంటి వాళ్ళను చూస్తుంటే సిగ్గుగా ఉందంటూ సమాధానం చెప్పింది. ఎన్ని చెప్పినా సమంత పెట్టిన ఆ పిక్ పై ప్రకంపనలు ఇప్పట్లో సద్దుమణిగేలా లేవు.

However, very recently, Samantha posted bikini outfits pics along with some accessories. This irked Akkineni fans, who, in fact, are eagerly waiting to see Samantha as 'Akkineni Kodalu'. Don't insult your fans Sam.

Akkineni Fans Angry on Samantha..!
samantha
bikini dress
samantha post in instargram
akkineni fans
naga chaitanya
nagarjuna