Advertisementt

చైతూ.... సమంతల విషయంలో హాట్‌టాపిక్‌..!

Fri 27th Jan 2017 01:48 PM
akkineni nagarjuna,nagachaitanya,samantha,akhil,shreyabhupal,chaitu and samantha engagement on 29th january 2017  చైతూ.... సమంతల విషయంలో హాట్‌టాపిక్‌..!
చైతూ.... సమంతల విషయంలో హాట్‌టాపిక్‌..!
Advertisement

అక్కినేని నాగార్జున పెద్ద కుమారుడు నాగచైతన్య, హీరోయిన్‌ సమంతలు త్వరలో పెళ్లి చేసుకోనున్న సంగతి తెలిసిందే. కాగా చైతూ తమ్ముడు అఖిల్‌ నిశ్చితార్దం శ్రేయాభూపాల్‌తో డిసెంబర్‌లో జరిగింది. ఇక తాజాగా చైతూ -సమంతల నిశ్చితార్ధ వేడుకను ఈనెల 29న చేయాలని నాగ్‌ నిర్ణయించాడట. ఇప్పటికే పలువురు ప్రముఖులకు ఆహ్వానాలు కూడా అందాయని సమాచారం. అఖిల్‌ పెళ్లి కంటే ముందే చైతూ -సమంతల వివాహం చేయాలని నాగ్‌ భావిస్తున్నాడట. మరోవైపు ఇప్పటికే రెండు తమిళ చిత్రాలకు సమంత ఓకే చెప్పింది. తాజాగా ఆమెకు రామ్‌చరణ్‌-సుకుమార్‌ల కాంబినేషన్‌లో రూపొందనున్న చిత్రంలో కూడా మెయిన్‌ హీరోయిన్‌ క్యారెక్టర్‌ వచ్చినట్లు చెబుతున్నారు. మరోపక్క ఆమె 'మహానటి' సావిత్రి జీవిత చరిత్ర ఆధారంగా రూపొందే చిత్రంలో కీలకపాత్రను చేయడానికి అంగీకరించింది. 

ఇటీవల కన్నడలో క్రైమ్‌థ్రిల్లర్‌గా రూపొందిన 'యూటర్న్' చిత్రం అక్కడ పెద్ద విజయం సాధించింది. ఈ చిత్రం తెలుగు రీమేక్‌లో నటించడానికి సమంత ఎంతో ఆసక్తిని చూపిస్తోంది. దీంతో తాజాగా చైతూ-సమంతలు కలసి బెంగుళూరు వెళ్లి ఈ చిత్ర నిర్మాతలతో పాటు దర్శకుడు పవన్‌కుమార్‌తో కూడా చర్చలు జరిపారు. ఈ చిత్రం రీమేక్‌ హక్కులను తమకే ఇవ్వాలనే ఒప్పందం చేసుకున్నారట. కాగా త్వరలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుందని తెలుస్తోంది. తెలుగుతో పాటు ఒకేసారి తమిళంలో కూడా తెరకెక్కించాలని భావిస్తున్న ఈ చిత్రాన్ని ఈ రెండు భాషలలో సమంతనే చేయాలని, చైతూ నిర్మించాలని ప్లాన్‌ చేస్తున్నారు. ఈ రెండు భాషలకు కూడా కన్నడ 'యూ టర్న్‌' ఒరిజినల్‌ వెర్షన్‌ దర్శకుడైన పవన్‌నే దర్శకత్వం వహించేలా వీరిద్దరు ఒప్పించారనే ప్రచారం జరుగుతోంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement