ముహూర్తాలు చూసుకుంటోన్న స్టార్స్‌..!

సంక్రాంతి సందడి ముగిసింది. అయినా కూడా ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్‌, మే.. ఇలా ప్రతి నెలా సినిమాల జాతర కొనసాగునుంది. మరోపక్క ఖాళీగా ఉన్న మన స్టార్స్‌ కొత్త చిత్రాలకు ముహూర్తాలు చూసుకుంటున్నారు. హీరోగా 'దృవ', నిర్మాతగా 'ఖైదీ' చిత్రం బిజీ పూర్తి చేసుకున్న రామ్‌చరణ్‌ సుకుమార్‌ దర్శకత్వంలో రూపొందే చిత్రాన్ని జనవరి30న ప్రారంభించనున్నాడు. ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్‌సంస్థ నిర్మిస్తోంది. ఇక 'జనతా గ్యారేజ్‌' తర్వాత చాలా కాలంగా ఎన్నో కథలు వింటున్న యంగ్‌టైగర్‌ ఎన్టీఆర్‌ ఎట్టకేలకు బాబి దర్శకత్వంలో తన అన్నయ్య సొంత బేనర్‌ ఎన్టీఆర్‌ఆర్ట్స్‌లో చిత్రం చేయనున్న సంగతి తెలిసిందే. 

ఈ చిత్రాన్ని ఫిబ్రవరి10న ప్రారంభించనున్నాడు. ఇక 14నెలలుగా వెండితెరకు దూరంగా విదేశీటూర్లు చేస్తున్న మాస్‌ మహారాజా రవితేజ దిల్‌రాజు నిర్మాతగా, అనిల్‌రావిపూడి దర్శకత్వంలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం మార్చిలో మొదలుకానుంది. ఇంకోపక్క 9ఏళ్ల రీఎంట్రీ తర్వాత 'ఖైదీ నెంబర్‌ 150'తో దుమ్మురేపుతున్న మెగాస్టార్‌ చిరంజీవి తాను సురేందర్‌రెడ్డి దర్శకత్వంలో నటించే 151వ చిత్రానికి అన్నీ వీలైతే ఈ చిత్ర నిర్మాత, తన తనయుడు రామ్‌చరణ్‌ బర్త్‌డే కానుకగా మార్చి 27న లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. వీరితో పాటు మరికొందరు స్టార్‌ హీరోలు కూడా ఈ రెండు నెలల్లోనే తమ తాజా చిత్రాలను కూడా ప్రారంభించాలని ముహూర్తాలు చూసుకుంటుండటం విశేషం. 

ram charan
chiranjeevi
young tiger ntr
mass haraja ravi teja
dil raj
babi
surender reddy