Advertisement

మిల్క్ బాయ్ చిత్రం అంతా సంచలనమే..!

మహేష్ - మురుగదాస్ కాంబినేషన్ లో తెరకెక్కబోయే  భారీ బడ్జెట్ చిత్రం గురించి రోజుకో వార్త సంచలనంగా బయటికి వస్తుంది. ఈ సినిమా అటు తెలుగు, ఇటు తమిళంలోను ఒకేసారి తెరకెక్కించడం.... ఇక మురుగదాస్ ఏదైనా కొత్తదనంగా ఉండాలని అన్ని వెరైటీగా అలోచించి సినిమాలు చెయ్యడం..... ఇక సూపర్ స్టార్ మహేష్ బాబు ఈ సినిమాలో నటించడం దగ్గర నుండి అన్ని ఆసక్తికరంగా ఉండడంతో ఈ సినిమా పై రోజు రోజుకి అంచనాలు పెరిగిపోతున్నాయి. మొన్న ఈ మధ్య ఈ సినిమా టైటిల్ లో ఇదే అంటూ 'సంభవామి' అనే టైటిల్ సోషల్ మీడియాలో హల్ చల్ చెయ్యడం మరవక ముందే  నిన్నటికి నిన్న ఈ సినిమాలో తమిళ్ హీరో భరత్ కీ రోల్ ప్లే చేస్తున్నాడని చెబుతున్నారు.

ఇక ఇప్పుడు మహేష్ - మురుగదాస్ చిత్ర స్టోరీ లైన్ ఇదే అంటూ ఒక వార్త ఇప్పుడు ఫిలింనగర్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్ర కథ ఏమంత కొత్తది కాకపోయినా దీనిలో  ఒక మంచోడు, చెడ్డోడు అనే అన్నదమ్ములతో  రెండు పాత్రలతో ఈ చిత్రాన్ని మురుగదాస్ తెరకెక్కిస్తున్నాడని చెబుతున్నారు. అయితే మహేష్ ఈ సినిమాలో రెండు పాత్రల్లో కనిపిస్తాడా లేక వేరెవరైనా మహేష్ సోదరుడిగా కనిపిస్తాడా అనేది తెలియాల్సి వుంది. ఇక ఈ చిత్రం 'తుపాకీ'  సినిమాకి సీక్వెల్ అని ప్రచారం కూడా జరుగుతుంది. అయితే ఈ విషయాన్నీ మురుగదాస్ ఎక్కడా రివీల్ చెయ్యలేదు. ఇంకా ఈ చిత్రంలో ఎస్ జె సూర్య విలన్ పాత్రలో కనిపించనుండగా రకుల్ ప్రీత్...మహేష్ కి జోడిగా నటిస్తుంది.

mahesh babu hero
director murugaadas
mahesh babu murugaadas combination movie
sambhavami movie titel
heroine rakul preet singh
tamil hero bharath