Advertisement

త్రివిక్రమ్ తో ఒక్కటైనా.. చేయాల్సిందే..!

Wed 30th Nov 2016 03:46 PM
trivikram srinivas,chiranjeevi,mega star,allu arjun,pawan kalyan,chiranjeevi film with mega star  త్రివిక్రమ్ తో ఒక్కటైనా.. చేయాల్సిందే..!
త్రివిక్రమ్ తో ఒక్కటైనా.. చేయాల్సిందే..!
Advertisement

డైరెక్టర్ తివిక్రమ్ అంటే డైలాగ్స్ తో చంపేస్తాడనే టాక్ వుంది. అందుకే అతన్ని మాటల మాంత్రికుడిగా అభివర్ణిస్తారు. ఇక ఈ మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్ లో నటించడానికి హీరోలందరూ పోటీ పడుతుంటారు. కానీ త్రివిక్రమ్ మాత్రం కొంతమంది సెలెక్టెడ్ హీరోలతోనే సినిమాలు చేస్తూ ఉంటాడు. అందులోను టాప్ హీరోలతోనే సినిమాలు చేస్తాడనే పేరుంది. ఈ పేరుని బ్రేక్ చేస్తూ నితిన్ తో సినిమా చేసి హిట్ కొట్టి అందరికి షాక్ ఇచ్చాడు. అయితే త్రివిక్రమ్ ప్లాపులతో బాధపడుతున్న హీరోలతో సినిమాలు చేసి వారికి హిట్ ఇచ్చె దర్శకుడిగా పేరు కొట్టేసాడు. ఎన్నో సినిమాల ప్లాపు తర్వాత పవన్.. త్రివిక్రమ్ డైరెక్టన్ లో జల్సాలో నటించి హిట్ కొట్టాడు. మళ్ళీ చానళ్ల తర్వాత అత్తారింటికి దారేదిలో నటించి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. ఇక అప్పటి నుండి పవన్, త్రివిక్రమ్ ఇద్దరూ మంచి దోస్తులైపోయారు.

ఇక త్రివిక్రమ్ హిట్ ట్రాక్ చూసి  జూనియర్ ఎన్టీఆర్ త్రివిక్రమ్ డైరెక్షన్ లో చెయ్యాలని ఆశపడ్డాడు. కానీ త్రివిక్రమ్ మాత్రం పవన్ తోనే సినిమా చెయ్యాలని కంకణం కట్టుకుని ఎట్టకేలకు పవన్ హీరోగా చిత్రానికి పూజా కార్యక్రమాలను కూడా జరిపించుకొని ఎన్టీఆర్ ని పక్కన పెట్టేసాడు. ఇక పవన్ తో సినిమాని.... పవన్ కాటమరాయుడు కంప్లీట్ కాగానే షూటింగ్ పట్టాలెక్కుతుందని త్రివిక్రమ్ ధీమాగా వున్నాడు.

అదలా ఉండగా ఈ మధ్యన చిరంజీవితో త్రివిక్రమ్ దాదాపు రెండు గంటలు భేటీ అయినట్లు వార్తలొస్తున్నాయి. అంటే చిరు - త్రివిక్రమ్ కాంబినేషన్ లో కూడా ఒక సినిమా వుంటుందనే ప్రచారం అప్పుడే సోషల్ మీడియా లో ఊపందుకుంది. ఇక మెగాస్టార్ రాజకీయాలను పక్కనెట్టేసి సినిమాల్లో బిజీ అవుతానని చెబుతున్నాడు. అందుకే వరసబెట్టి సినిమాలు చెయ్యాలనే ప్లాన్ లో వున్నాడు. తన 150 వ చిత్రం ఖైదీ నెంబర్ 150 ని వి.వి వినాయక్ డైరెక్టన్ లో చేస్తున్న చిరు... తన 151 చిత్రాన్ని బోయపాటి డైరెక్షన్ లో చేయనున్నాడని ప్రచారం జరుగుతున్న నేపధ్యంలో ఇప్పుడు త్రివిక్రమ్ తో కూడా ఒక సినిమా ఉంటుందని అంటున్నారు . ఇక త్రివిక్రంతో చిరు 153 వ చిత్తాన్ని లైన్ లో పెట్టాడని అందుకే ఇంతగా మాట్లాడుకున్నారనే ప్రచారం జరుగుతుంది. ఇక త్రివిక్రమ్.. పవన్ తో చేసే సినిమా అయిపోగానే మెగాస్టార్ మూవీ చేస్తాడని అంటున్నారు.  దీనిపై అతి త్వరలోనే న్యూస్ రానుందని ఇండస్ట్రీ లో టాక్ మొదలైంది. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement