Advertisement

'ఇజం'పై భారీ అశలు పెట్టుకున్న కళ్యాణ్‌రామ్‌...!

Fri 19th Aug 2016 09:18 PM
kalyan ram,ijam movie,puri jagannath style 8 crores budget 25 crores  'ఇజం'పై భారీ అశలు పెట్టుకున్న కళ్యాణ్‌రామ్‌...!
'ఇజం'పై భారీ అశలు పెట్టుకున్న కళ్యాణ్‌రామ్‌...!
Advertisement

తెలుగులో సినిమా ఎలా ఉన్నా సరే కలెక్షన్లు అదిరిపోవాలంటే స్టార్‌ ఇమేజ్‌ ఉండాలి. దాంతో స్టార్స్‌కు తప్ప మిగిలిని హీరోల జయాపజయాల పైనే కలెక్షన్లు ఆధారపడి ఉంటాయి. తన కెరీర్‌లో కేవలం రెండు, మూడు హిట్స్‌ మాత్రమే ఉన్న కళ్యాణ్‌రామ్‌ ఎక్కువ శాతం పరాజయాలనే రుచిచూశాడు. 'అతనొక్కడే, హరేరామ్‌, పటాస్‌'లు మాత్రమే ఆయనకు విజయాలను అందించాయి. ఇక తాజాగా ఆయన ప్రస్తుతం పూరీజగన్నాద్‌తో చేస్తున్న 'ఇజం'పై మాత్రం భారీ ఆశలే పెట్టుకున్నాడు. ఈ చిత్రాన్ని కూడా తన సొంతంగా నిర్మిస్తున్న కళ్యాణ్‌రామ్‌... 'ఇజం'తో పూరీ తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్‌ను తీసుకొస్తాడని గంపెడాశలు పెట్టుకున్నాడు. ఎందరో హీరోల బాడీ లాంగ్వేజ్‌, స్టైలిష్‌ లుక్‌ మార్చి స్టార్‌స్టేటస్‌ కల్పించిన దర్శకుడు పూరీ జగన్నాథ్‌ కూడా 'ఇజం'తో తనకు అలాంటి సక్సెస్‌నే ఇస్తాడనే ఆశతో ఉన్నాడు. కాగా ఈచిత్రానికి దర్శకుడైన పూరీకి కళ్యాణ్‌రామ్‌ ఈ ప్రాజెక్ట్‌ చేస్తున్నందుకు పారితోషికంగా.. ఏకంగా రూ.8కోట్లు ఇచ్చాడని, పూరీ స్టైల్‌ ఆఫ్‌ మేకింగ్‌ కోసం నిర్మాతగా ఎక్కడా రాజీ పడకుండా ఈ చిత్రాన్ని దాదాపు రూ.25కోట్ల పైచిలుకు బడ్జెట్‌ను పెడుతున్నాడని, మొత్తం మీద కళ్యాణ్‌రామ్‌ తన స్టార్‌ స్టేటస్‌ కోసం డబ్బులను నీళ్లలా ఖర్చుపెడుతున్నాడని సమాచారం. కాగా ఈచిత్రం సెప్టెంబర్‌ 29న విడుదల కానుంది. మరి కళ్యాణ్‌రామ్‌ కోరికను పూరీ నెరవేరుస్తాడా? లేదా? అన్నది వేచిచూడాల్సిన అంశం. 

Advertisement

Loading..
Loading..
Loading..
Advertisement