Advertisementt

ఫ్యామిలీ కోసం ఇమేజ్‌ పక్కన పెట్టేస్తున్నారు!

Mon 08th Aug 2016 05:44 PM
family heroes,image,sushanth,naga chaitanya,akhil,allu sirish,allu arjun  ఫ్యామిలీ కోసం ఇమేజ్‌ పక్కన పెట్టేస్తున్నారు!
ఫ్యామిలీ కోసం ఇమేజ్‌ పక్కన పెట్టేస్తున్నారు!
Advertisement
Ads by CJ

తమ కుటుంబంలోని ఇతర హీరోల కోసం స్టార్‌ హీరోలు తమ ఇమేజ్‌ను పణంగా పెట్టి ఆయా చిత్రాలకు హైప్‌ తెచ్చేందుకు విశ్వప్రయత్నాలు చేస్తున్నారు. కాగా అక్కినేని ఫ్యామిలీ హీరో అయిన సుశాంత్‌ నటిస్తున్న 'ఆటాడుకుందాం..రా' చిత్రంలో ఓ కామియో పాత్రలో నాగచైతన్య కనిపించనుండగా, అక్కినేని అఖిల్‌ కూడా ఓ పాటలో తళుక్కున మెరవనున్న విషయం తెలిసిందే. అఖిల్‌ నటించిన తొలి చిత్రం 'అఖిల్‌' లో నాగార్జున సైతం చిందేసిన సంగతి విదితమే. కాగా నాగార్జునకు ఇలా కనిపించడం కొత్తేమీ కాదు. అక్కినేని ఫ్యామీలీలోని మరో హీరో సుమంత్‌కు క్రేజ్‌ రావడానికి నాగ్‌ ఏకంగా ఆయనతో కలిసి 'స్నేహమంటే.. ఇదేరా' చిత్రం చేసి 'త్యాగమంటే.. ఇదేరా' అని నిరూపించాడు. ఇక మెగాస్టార్‌ చిరంజీవి సైతం తన తనయుడు రామ్‌చరణ్‌ నటించిన 'మగధీర', 'బ్రూస్‌లీ' చిత్రాల్లో తళుక్కున మెరిసి తన తనయుడికి మరింత బాసటగా నిలిచాడు. తాజాగా అల్లుఅర్జున్‌ కూడా తన తమ్ముడు అల్లుశిరీష్‌కు లైఫ్‌ ఇవ్వడం కోసం మల్లిడి వేణు దర్శకత్వంలో అల్లుశిరీష్‌ నటిసున్న చిత్రంలో ఓ పాత్రలో కనిపించనున్నాడు. ఇక దగ్గుబాటి హీరో రానా కోసం బాబాయ్‌ వెంకటేష్‌ 'కృష్ణం వందే జగద్గురుం' చిత్రంలో ఓ పాటలో నటించాడు. ఇలా మన స్టార్స్‌ తమ కుటుంబ హీరోల కెరీర్‌లను మలుపుతిప్పడం కోసం నానా తంటాలు పడుతున్నారని చెప్పకతప్పదు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ