బలహీనుడి పక్కన బలమే 'జనతా గ్యారేజ్'!

CineJosh news

కొరటాల డైరెక్షన్ లో మోహన్ లాల్- ఎన్టీఆర్ కలిసి నటిస్తున్న 'జనతా గ్యారేజ్' టీజర్ ని రంజాన్ స్పెషల్ గా ఈరోజు(జులై 6) న విడుదల చేశారు. సినిమా మీద అంచనాలు పెంచడానికి ఈ టీజర్ ఒక్కటి చాలు. ఎన్టీఆర్ స్టయిల్ మరియు డైలాగ్ డెలివరీ స్పెషల్ అట్రాక్షన్  గా వున్న ఈ టీజర్ లో ఎన్టీఆర్ చెప్పిన డైలాగ్స్ కూడా మాములుగా లేవ్. 'బలవంతుడు బలహీనుణ్ణి భయపెట్టి బతకడం ఆనవాయితీ .... బట్ ఫర్ ఏ చేంజ్.. ఆ బలహీనుడు పక్కన కూడా ఓ బలముంది. జనతా గ్యారేజ్...ఇచ్చట అన్ని రిపేర్లు చేయబడును' అనే డైలాగ్ తో పాటు ఎన్టీఆర్ బైక్ మీద వచ్చే సీను..అలాగే ఎన్టీఆర్, మోహన్ లాల్ ముస్లింలా నడిచొచ్చి ఈద్ ముబారక్ చెప్పే సీన్ తో  కట్ చేసిన ఈ టీజర్ ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. అంతే కాకుండా దేవిశ్రీ ప్రసాద్ ఇచ్చిన బ్యాగ్రౌండ్ మ్యూజిక్ కూడా అదిరిపోయే రేంజ్ లో ఉండటం ఈ టీజర్ కి పెద్ద హైలెట్. మైత్రి మూవీ మేకర్స్ నిర్మాణంలో రూపుదిద్దుకుంటున్న ఈ మూవీలో ఎన్టీఆర్ సరసన సమంత, నిత్యామీనన్ హీరోయిన్ లు గా నటిస్తున్నారు. 

 

Click Here to see the Janatha Garage Teaser

janatha garage
janatha garage teaser talk
janatha garage teaser review
jr ntr
koratala siva
mohanlal