రష్మీ, అనసూయలకు గట్టి పోటీనిస్తుంది!

జబర్దస్త్ ప్రోగ్రామ్ లో యాంకర్ లుగా చేసిన రష్మీ గౌతమ్, అనసూయ లకు ఆ  ప్రోగ్రామ్ మంచి పేరు తో పాటు అవకాశాలు కూడా వెల్లువలా వచ్చేలా చేసింది. వీరు ఆ ప్రోగ్రామ్ లో యాంకర్స్ గా తమ అంద చందాలతో మంచి రేటింగ్స్ వచ్చేలా చేశారు. దీనితో వీరికి టీవీ షోస్ లోనే కాకుండా సినిమాల నుండి కూడా మంచి ఆఫర్లు వచ్చ్చాయి. రష్మీ అయితే హీరోయిన్ గా తన అందాలను ఆరబోస్తూ రెచ్చిపోతుంటే అనసూయ మాత్రం కొన్ని ముఖ్యమైన పాత్రలలో నటిస్తుంది. ఒక పక్క టీవీ షోస్ తో మరో పక్క సినిమాలతో వీరు అస్సలు ఖాళీ లేకుండా ఫుల్ బిజీ అయిపోయారు. అయితే వీరికి పోటీగా మరో బుల్లితెర నటి వచ్చి చేరింది. ఆమె కూడా తన నటనతో ప్రేక్షకులను మైమరపింప చేస్తుంది. ఆమె ఎవరో కాదు యాంకర్ శ్రీముఖి. శ్రీముఖి రోజు రోజుకు తన ప్రాముఖ్యతను పెంచుకుంటూ రేష్మి కి, అనసూయకు గట్టి పోటీనిస్తుంది. వరుస టీవీ షోస్ తో తెగ బిజీ అయిపోతుంది. కొన్ని సినిమాలలో హీరోయిన్ గా కూడా నటించిన శ్రీముఖి.. ఇప్పుడు కొన్ని మంచి పాత్రలలో నటిస్తూ రోజు రోజుకు పాపులర్ అవుతుంది. తాజాగా ఈమె నటించిన జెంటిల్మన్ లో రిపోర్టర్ పాత్రలో ఒదిగిపోయి నటించింది. అలాగే టీవీ షోస్ లో కూడా హాట్ హాట్ గా కనిపిస్తూ కుర్ర కారుకి మరింత దగ్గర అవ్వడానికి అన్ని ప్రయత్నాలు చేస్తుంది.ఇక శ్రీముఖి..రేష్మి, అనసూయలలా రెచ్చిపోయి జనాలను ఎంటర్ టైన్ చేస్తుందనడం లో ఎటువంటి సందేహం లేదు.

rashmi gautam
anasuya
srimukhi
srimukhi anchor and actress
srimukhi movies
gentleman
Advertisement
Advertisement