Advertisementt

కేసీఆర్‌ కీ అంటుకుందంట..!

Fri 24th Jun 2016 01:08 PM
kcr,chandrababu,kamma,caste feeling  కేసీఆర్‌ కీ అంటుకుందంట..!
కేసీఆర్‌ కీ అంటుకుందంట..!
Advertisement
Ads by CJ

తెలంగాణలో ఎవరెన్నిచెప్పినా రెడ్డి కులస్దులదే హవా. కాకపోతే ఉద్యమనేత కావడంతో వెలమ వర్గానికి చెందిన కేసీఆర్‌ పీఠం అధిరోహించాడు. తెలంగాణలో తన సామాజికవర్గం నాయకులను కేసీఆర్‌ బాగా ప్రోత్సహిస్తున్నాడు. ఏపీలో ఉన్నంత స్దాయిలో కాకపోయినా గ్రేటర్‌హైదరాబాద్‌తో పాటు రెండు మూడు జిల్లాలో కమ్మవారి ఆధిపత్యం బాగానే ఉంది. సో.. కేసీఆర్‌ కన్ను కమ్మవారిపై పడింది. దీనిలో భాగంగా రాష్ట్రంలోని పలు కమ్మ నాయకులను కేసీఆర్‌ తన పార్టీలో చేర్చుకుంటున్నాడు. తుమ్మల నాగేశ్వరరావు, మాగంటిగోపీనాధ్‌, అరికెపూడి గాంధీ, పువ్వాడ అజయ్‌, నల్లమోతు భాస్కరరావు వంటి వారికి టిఆర్‌ఎస్‌ తీర్థం ఇచ్చాడు. వాస్తవానికి కుల రాజకీయాలు అన్ని రాష్ట్రాలల్లో, అన్ని ప్రాంతాల్లో ఉన్నాయి. కానీ కొందరు మాత్రం కేవలం చంద్రబాబు మాత్రమే ఏపీలో కులరాజకీయాలు చేస్తున్నాడని, కేవలం తన సామాజిక వర్గం వారినే పైకి తెస్తున్నాడనే ప్రచారం జరుగుతోంది. మరి చంద్రబాబును తప్పుపడుతున్న మేథావి వర్గ వ్యక్తులు ఈ విషయంలో కేసీఆర్‌ గురించి మాత్రం నోరెత్తడం లేదు. తప్పు ఎవరు చేసినా తప్పే? అని వారికి తెలియదా? అని ఏపీలోని కమ్మనాయకులు మండిపడుతున్నారు. 

Addvertisement



Loading..
Loading..
Loading..
Advertisement
Ads by CJ